Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Aug-2016 15:52:13
facebook Twitter Googleplus
Photo

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అందించిన కథతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా తీస్తే ఎలాగుంటుంది.. ? అదిరిపోద్దీ. ఇప్పుడిదే జరిగే అవకాశాలున్నట్టు సమాచారమ్. కేవలం హీరోగానే కాకుండా ఫైట్ మాస్టర్‌గా, స్ర్కిప్టు రైటర్‌గా కూడా పవన్ తన సినిమాలకు పనిచేశాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ?సర్థార్ ? గబ్బర్ సింగ్?కి స్వయంగా పవన్ నే కథ అందించిన విషయం తెలిసిందే. జానీ, గుడుంబాశంకర్ చిత్రాలకి పవన్ కలం పనిచేసింది. అయితే, స్క్రిప్ట్ లో పవన్ చేయివేసిన ప్రతీ సినిమా బాక్సాఫీసు దగ్గర బోల్తాపడ్డాయి. అయినా.. పట్టు వదవలని విక్రమార్కుడిలా పవన్ తాజా చిత్రం డాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి పవన్ స్క్రిప్టు అందిస్తుండటం విశేషం.

అయితే, పవన్ తన భావాలకి దగ్గర ఉండేలా ఓ కథని రెడీ చేశాడట. ఇప్పుడీ కథతో త్రివిక్రమ్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్. అదీ కూడా పవన్ హీరోగానే లేండి. కాకపోతే.. పవన్ అందించిన మూల కథకి కథనం, మాటలు త్రివిక్రమ్ జత చేసే ఓ పవర్ ఫుల్ కథని రెడీ చేయనున్నాడట. ప్రస్తుతం పవన్ డాలీ దర్శకత్వంలో తెరకెక్కున్న చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తవ్వగానే త్రివిక్రమ్ తో సినిమా ఉండనుంది. మొత్తానికి.. పవన్ కథతో త్రివిక్రమ్ సినిమా రానుందన్న మాట.

,  ,  ,  ,  ,  ,  ,