Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Dec-2015 11:42:24
facebook Twitter Googleplus
Photo

కీర్తి సురేష్ - రామ్ జంటగా నటించిన చిత్రం నేను - శైలజ. ఇటీవలే టీజర్ సహా పాటలు రిలీజయ్యాయి. దేవీశ్రీ మ్యూజిక్ సూపర్ హిట్ అయ్యింది. కిషోర్ తిరుమలశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జనవరి 1న రిలీజ్ కానుంది.

రామ్ కెరీర్ కి ఇది అత్యంత కీలకమైన సినిమా. హిట్ కొట్టాల్సిన సందర్భమిది. అందుకే రామ్ ఎంతో ఎగ్జయిట్ మెంట్ తో చూస్తున్నాడు. నిర్మాత స్రవంతి రవికిషోర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి నిర్మిస్తున్న చిత్రమిది. ఇటీవలి కాలంలో రామ్ కి వరుసగా ఫ్లాప్ లు ఎదురయ్యాయి. ఎట్టి పరిస్థితిలో ఓ ప్రామిస్సింగ్ హిట్టిచ్చి తనయుడి కెరీర్ ని నిలబెట్టాలన్నది ఆయన తపన. అయితే చివరి నిమిషంలో ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ టాలీవుడ్ లో చర్చకొచ్చింది. స్టార్ డైరెక్టర్ కం రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కి నిర్మాత స్రవంతి రవికిషోర్ తో సత్సంబంధాలున్నాయి. స్రవంతి కిషోర్ నిర్మించిన నువ్వే నువ్వే సినిమాతోనే త్రివిక్రమ్ దర్శకుడయ్యాడు. కాబట్టి ఆ రిలేషన్ తో నేను - శైలజ స్క్రిప్టు విషయంలో త్రివిక్రమ్ కొన్ని మార్పు చేర్పులు చెప్పాడని అనుకుంటున్నారు.

అయితే ఇదే విషయంపై దర్శకుడిని ప్రశ్నిస్తే అలాంటిదేం లేదని చెప్పాడు. త్రివిక్రమ్ ఈ మూవీకి పనిచేయలేదని స్పష్టం చేశాడు. రీజన్ ఏదైనా నేను -శైలజ పూర్తిగా కిషోర్ తిరుమల క్రెడిట్ లోకి వెళుతోంది. జయాపజయాలకు పూర్తిగా అతడే బాధ్యత వహించబోతున్నారని అనుకోవచ్చు.

,  ,  ,  ,  ,  ,