Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Jun-2015 17:54:46
facebook Twitter Googleplus
Photo

మొదటి నుంచి కూడా వెంకటేష్ రీమేక్ చిత్రాలకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ వచ్చాడు. ఇప్పటికీ అప్పుడప్పుడు ఆయన రీమేక్ లపై దృష్టిపెడుతూనే ఉన్నాడనడానికి నిదర్శనమే 'దృశ్యం'. ఈ సినిమా అందించిన విజయంతో ఆయన మరో మలయాళ రీమేక్ లో నటించేందుకు సిద్ధమవుతున్నట్టుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఆయనని అంతగా ఆకట్టుకున్న ఆ సినిమాయే 'భాస్కర్ ది రాస్కెల్'.

మమ్ముట్టి .. నయనతార నటించిన ఈ చిత్రం అక్కడ అనూహ్యమైన విజయాన్ని సాధించింది. దాంతో ఈ కథని తెలుగు తెరపై ఆవిష్కరించడానికిగాను నిర్మాత సురేష్ బాబు రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో నిజమెంతనేది తెలియాల్సి వుంది.

,  ,