Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Sep-2017 14:03:55
facebook Twitter Googleplus
Photo

త్రిషా కృష్ణన్ ఒకేసారి అరడజన్ సినిమాలు షూటింగ్ చేసేస్తోందంటే.. చెన్నై భామ జోరు అర్ధమవుతుంది. కెరీర్ ఆఖరి దశకు వచ్చేసిందేమో అని అంతా అనుకున్న స్థితిలో వరుసగా సినిమాలు సంతకం చేసేసి.. ఇండస్ట్రీకి పెద్ద షాక్ నే ఇచ్చింది త్రిష.

అటు సినిమాలు మాత్రమే కాదు.. ఇటు యాడ్ అండార్స్ మెంట్స్ విషయంలో కూడా త్రిష జోరు చూపిస్తోంది. అలాగని త్రిష ఏదీ దాచుకునే టైప్ కాదు. సహజంగా ఎవరైనా స్టార్ ఓ డీల్ కుదుర్చుకుంటే.. టీవీల్లో ఆ యాడ్ వచ్చే వరకూ సీక్రెట్ గా మెయింటెయిన్ చేస్తారు. కానీ త్రిష మాత్రం సైన్ చేసిన రోజునే ఈ విషయాన్ని చెప్పేస్తోంది. ఇంకా డీటైల్డ్ గా చెప్పాలంటే.. వీకేసీ అనే చెప్పల్ బ్రాండ్ కు సైన్ చేస్తున్న సందర్భాన్ని ఫోటో తీయించుకుని నెట్ లో పెట్టేసి.. అభిమానులకు చూపించేసింది త్రిష. ఆ బ్రాండ్ పై అమ్మే ఫుట్ వేర్ లో స్కాలినో అనే లేడీస్ వేర్ కు త్రిష ప్రచారం చేయబోతోంది.

నార్త్ లో ఈ బ్రాండ్ కు అజయ్ దేవగన్ ప్రచారం చేస్తున్నాడు. గతంలో ఇదే కంపెనీకి టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ యాడ్స్ చేయగా.. ఇఫ్పుడీ అవకాశం త్రిష చెంతకు చేరుకుంది. అంతా బాగానే ఉంది కానీ.. ఒకట్రెండు తెలుగు సినిమాలను కూడా ఒప్పుకుని.. టాలీవుడ్ ఆడియన్స్ ను కూడా త్రిష మురిపించవచ్చు కదా.. ఇక్కడ కూడా ఆమెకు బోలెడంత ఫ్యాన్ బేస్ ఉంది కదా అని అభిమానులు తెగ ఫీలయిపోతున్నారు.

,  ,  ,  ,  ,  ,