Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Dec-2017 10:05:20
facebook Twitter Googleplus
Photo

విజయ్ సాయి హైదరాబాద్ లోని యూసుఫ్ గూడాలో ఉన్న తన ఫ్లాట్ లో ఈ రోజు ఉదయం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమా అవకాశాలు రాకపోవడంతోనే డిప్రెషన్ లోకి వెళ్లిపోయి సూసైడ్ చేసుకున్నాడని అంతా భావించారు. అయితే ఈ ఆత్మహత్య వ్యవహారంలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. భార్య వనితతో విడాకులు - మనోవర్తి వ్యవహారం - ఆమె వేధింపుల వల్లే విజయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడడని ఆయన తండ్రి ఆరోపించిన సంగతి తెలిసిందే.ఆదివారం ఉదయం వనిత మనుషులు విజయ్ కారును తీసుకెళ్లడంతో విజయ్ ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని ఆయన అన్నారు. ఆ విషయం గురించి విజయ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారని - పూర్తి విచారణ చేపట్టాకే స్పందిస్తామని పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది. తాజాగా ఆత్మహత్యకు ముందు విజయ్ తీసుకున్న సెల్ఫీ వీడియో పోలీసులకు దొరికినట్లు సమాచారం. తన ఆత్మహత్యకు కారకులైన వ్యక్తుల వివరాలను విజయ్ ఆ వీడియోలో విజయ్ స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది.

రెండు సంవత్సరాల నుంచి తన భార్య నుంచి తాను విడిగా ఉంటున్నానని ఆ వీడియోలో విజయ్ చెప్పాడు. తమకు ఓ కూతరు ఉందని తెలిపాడు. విడాకుల కోసం తన భార్య కోర్టులో పిటిషన్ వేసి భరణం కోరిందని చెప్పాడు. ఆ కేసుల నుంచి బయటపడాలంటే రూ. 3 కోట్ల వరకు డిమాండ్ చేసిందన్నాడు. ఆమెకు మద్దతుగా ఈ వ్యవహారంలో శశిధర్ అనే వ్యక్తితో పాటు అడ్వొకేట్లు తనపై వేధింపులకు పాల్పడ్డారన్నాడు. 2 రోజుల క్రితం తన ఇంట్లో వస్తువులు - కార్లు తీసుకెళ్లారని - ఆ అవమానం తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని చెప్పాడు. వాల్ పోస్టర్ సినిమాతో వనిత పరిచయమైందని - గతంలోనూ అమ్మిరెడ్డి అనే వ్యక్తితో ఆమెకు పెళ్లి జరిగిందని చెప్పాడు. అంతేకాక తమ మధ్య శశిధర్ ఆనే వ్యక్తి రావడంతో మనస్పర్థలు పెరిగాయని అన్నాడు. తన భార్య వనిత వద్ద ఆ వాతావరణంలో తన కుమార్తె పెరగడం తనకు ఇష్టం లేదన్నాడు. వనితతోపాటు - అడ్వకేట్ శ్రీనివాస్ - శశిధర్ కూడా తనను మానసికంగా వేధించారని తెలిపాడు.

అయితే ఈ వ్యవహారంలో వనితా రెడ్డి వాదన మరోలా ఉంది. ఓ మీడియా చానెల్ తో మాట్లాడిన ఆమె విజయ్ పై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త ఆత్మహత్యపై అనుమానాలున్నాయని అన్నారు. తాను విజయ్ ను బెదిరించలేదన్నారు. తామిద్దరం రెండేళ్లుగా విడిపోయి బతుకుతున్నామని ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. రెండేళ్లుగా కోర్టులో తమ డైవోర్స్ కేసు నడుస్తోందన్నారు. విజయ్ కు వేరే అమ్మాయితో సంబంధం ఉందని - ఆ విషయంపై ప్రశ్నించడంతో తమ మధ్య గొడవలు జరిగాయని చెప్పారు. విజయ్ తండ్రికి ఈ విషయం చెప్పినా పట్టించుకోలేదన్నారు. తాము విడిపోయాక రెండేళ్ల క్రితమే ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాడని - ఇపుడు ఆమెను కూడా వదిలేశాడని చెప్పారు. తనను విజయ్ ఎన్నో చిత్రహింసలకు గురి చేశాడని... వాటి గురించి తాను ఎన్నడూ బయట చెప్పుకోలేదని తెలిపారు. పిల్లలు వద్దని తనను వేధించాడని - 3 సార్లు అబార్షన్ చేయించాడని - చివరకు వాళ్ల నాన్నతో చెప్పి బతిమిలాడితే విజయ్ ఒప్పుకున్నాడని చెప్పారు. విజయ్ కు తన తండ్రితో ఆస్తి తగాదాలున్నాయని చెప్పారు. ఆ కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చన్నారు.

అంతేకాక విజయ్ కు ఆరోగ్య సమస్యలున్నాయని చెప్పారు. చాలా రోజులుగా తన విజయ్ కు హెచ్ ఐవీ ఉందని తాను ఎన్నో రోజులు బతకబోనని విజయ్ చెబుతుండేవాడని అన్నారు. హెచ్ ఐవీ ఉన్న విషయాన్ని ఆయనతో శారీరక సంబంధం పెట్టుకున్న అమ్మాయి చెప్పిందన్నారు. ఆత్మహత్యకు అది కూడా ఒక కారణం కావచ్చన్నారు. తాను బయటకు వచ్చేసిన తరువాత ఈ విషయం తెలిసిందన్నారు.

తనను చిత్రహింసలకు గురిచేసినపుడు తాను ఆత్మహత్యకు పాల్పడ్డానని - సూసైడ్ అటెంప్ట్ చేయాల్సింది ఆయన కాదని... తానని అన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం విజయ్ వద్ద పాప రెండు రోజులు ఉంటుందని - పాపను మళ్లీ తీసుకొచ్చేందుకు తాను విజయ్ వద్దకు వెళ్లానని తెలిపారు. ఆ సమయంలో తమ మధ్య ఎలాంటి గొడవ జరగలేదని చెప్పారు. విజయ్ ఆత్మహత్యకు పాల్పడేంత పిరికివాడు కాదని చెప్పారు. తనకూ ఆయన ఆత్మహత్యపై అనుమానాలున్నాయన్నారు.

,  ,  ,  ,