Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Sep-2017 14:14:52
facebook Twitter Googleplus
Photo

కళ్యాణ్ కొత్త సినిమా కాసింత స్లోగా అయినా.. పర్ఫెక్ట్ గానే రెడీ అయిపోతోంది. ఇప్పటికే చాలాభాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది పొంగల్ పండుగ సందర్భంగా థియేటర్లలోకి వస్తుందనే విషయం యూనిట్ అధికారికంగానే చెప్పేసింది. ఈ సినిమాలో చాలానే సర్ ప్రైజులను ఆడియన్స్ కు ఇవ్వబోతున్నాడట దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

రీసెంట్ గా త్రివిక్రమ్ తో ఉదయభాను కాసేపు మీటింగ్ కావడంపై కొత్త రూమర్స్ బయల్దేరాయి. పవన్-త్రివిక్రమ్ సినిమాలో ఉదయభానుతో ఓ ఐటెం సాంగ్ చేయించే అవకాశాలపై చర్చలు జరిగాయని అంటున్నారు. ఈమధ్య యాంకర్లతో ఐటెం సాంగ్స్ చేయించే కల్చర్ కూడా బాగానే ఊపందుకుంటోంది. పైగా ఉదయభాను కూడా ఈ మధ్యనే మళ్లీ యాంకరింగ్ స్టార్ట్ చేసింది. ఓ డ్యాన్స్ ప్రోగ్రాంను హోస్ట్ చేసేయనుంది. బతుకమ్మ పాటలో కూడా మెయిన్ అట్రాక్షన్ గా ఉదయభానునే నిలిచింది. ఇలాంటి సమయంలో ఉదయభానుతో ఐటెం సాంగ్ చేయిస్తే.. అది కచ్చితంగా ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసే పాయింట్ అవుతుందని భావించాడట త్రివిక్రమ్.

అదే విషయాన్ని ఈ హాట్ యాంకర్ కు కన్వే చేయడం.. గతంలో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే రూపొందిన జులాయి మూవీలో ఐటెం సాంగ్ చేసిన అనుభవం ఉండడంతో.. ఇప్పుడు కూడా ఒప్పేసుకుందని అంటున్నారు. అయితే.. ఉదయభాను ఐటెం సాంగ్ దాదాపు ఖాయమే

,  ,  ,  ,