Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Sep-2017 10:08:03
facebook Twitter Googleplus
Photo

ప్రపంచమంతా పాపులారిటీని సంపాదించుకున్న సన్నీ లియోన్ ప్రస్తుతం ఇండియాలో తనదైన శైలిలో సినిమాలను చేస్తోంది. సౌత్ - నార్త్ అని తేడా లేకుండా వరుసగా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ.. అప్పుడప్పుడు కథానాయికగా ప్రయోగాలను కూడా చెస్తోంది. ఇక సోషల్ మీడియాలో సన్నీ ని ఫాలో అయ్యేవారు చాలామందే ఉన్నారు.

సన్నీ ఎప్పుడు ఏ ఫొటో పెడుతుందా అని నెటిజన్లు చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తుంటారు.. అయితే అలాంటి వారి కోసం సన్నీ రీసెంట్ గా ఓ ఫోటో పోస్ట్ చేసింది. ఎప్పుడు హాట్ గా గ్లామర్ గా ఉండే పోటోలను పోస్ట్ చేసే సన్నీ ఈ సారి కాస్త కొత్తగా ఒక ఫొటోలో వినూత్నంగా గా దర్శనం ఇచ్చింది. ప్రొస్తేటిక్స్ వేసుకుని ఉన్న ఆ ఫొటో లో సన్నీ హాలీవుడ్ సినిమాల్లో మమ్మీలా దర్శనం ఇచ్చింది. మొదట అందరు ఈ పిక్ చూసి నమ్మలేదు. కానీ అమ్మడు తను నటించబోయే కొత్త సినిమా కోసం ఈ తరహాలో కొన్ని ప్రయోగాలు చేస్తున్నట్లు చెప్పడంతో అందరూ సన్నీ చాలా గ్రేట్ అంటున్నారు. అలా ముఖానికి సుద్దను పులిమి.. దాని ద్వారా మేకప్ ను తయారుచేస్తారు. అలాగే 3డిలో ముఖాన్ని తయారు చేయడానికి ఇదే తరహాలో చేశాక ఒక ముఖ శిల్పాన్ని కూడా తయారుచేస్తారు. గతంలో బాహుబలి టైములో అనుష్కకు కూడా ఇలాంటి ప్రోస్తెటిక్స్ వేయడం మనం చూశాం.

ఇకపోతే సన్ని లియోన్ త్వరలోనే భూమి సినిమాలోని ఐటెం సాంగ్ ద్వారా అలరించనుంది.

,  ,  ,  ,  ,