మన తెలుగునాట సంక్రాంతి పండుగకు ఎంత ప్రాధాన్యముందో తమిళనాట కూడా అంతే వుంది. అందుకే, అక్కడ కూడా పెద్ద పండుగకు పెద్ద హీరోల సినిమాలు పడుతుంటాయి. ఇప్పటికే, తెలుగులో పవన్, వెంకీల 'గోపాల గోపాల', ఎన్టీఆర్ 'టెంపర్' రిలీజ్ డేట్స్ ఇచ్చేసుకున్నాయి. తమిళంలో విక్రం, విజయ్ మిల్టన్ కాంబోలో రూపొందుతున్న 'పత్తు ఎన్రాత్తు కుళ్ళ', అజిత్, గౌతమ్ మీనన్ కాంబోలో వస్తున్న 'ఎన్నై అరిందాల్', విశాల్ నటిస్తున్న 'అంబాలి' సంక్రాంతికి రెడీ అవుతున్నాయి. తాజాగా ఈ పోరులో చేరడానికి కమల్ హాసన్ కూడా సై అంటున్నాడు. ఆయన నటిస్తున్న 'ఉత్తమ విలన్' చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కమల్ కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగు వుంది కాబట్టి, ఇక్కడ కూడా ఆ సినిమా పోటీ ఇస్తుందనే చెప్పచ్చు.
kamalhasan, lifestory, book, comingsoon, news, uttamavillain, pongalrelease,