Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Jun-2017 10:02:22
facebook Twitter Googleplus
Photo

భలే మంచి రోజు తో సుధీర్ బాబుకి మంచి గుర్తింపు వచ్చింది. అలానే ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన వమికా గబ్బి కూడా ఫ్రెష్ ఫేస్ తో బాగానే అందరినీ ఆకట్టుకుంది. కానీ ఆ సినిమా సక్సెస్ తరువాత మరో తెలుగు సినిమా చేయలేదు ఈ సుందరి. తెలుగులో ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమాలో పనిచేసిన నటులుకు వరుసగా అలాంటి పాత్రలో లేకుంటే ఆ మార్కెట్ ను వాడుకునే పాత్రలతో సినిమాలు వస్తాయి. మరి ఈ సుందరి పరిస్థితి ఏంటంటారు?

అలాంటివి ఎన్ని వచ్చినా కూడా ఈ అమ్మడు వద్దని చెబుతోందట. అందుకే ఇప్పటివరకు మరో ఎప్పియరెన్స్ లేదు. “భలే మంచి రోజు తరవాత నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. నిజం చెప్పాలంటే చాలా మంచి పేమెంట్ కూడా ఆఫర్ చేశారు. నేనే వాటిని చేయడానికి ఇష్టంలేక వదులుకున్నాను. విన్న ఏ సినిమా స్క్రిప్ట్ కూడా అంత ఆశక్తిగా లేకపోవడంతో నో చెప్పాను. అయనా నాకు ఇప్పుడు తొందరగా సినిమాలు చేసి డబ్బులు సంపాదించాలి అనేమీ లేదు. స్క్రిప్ట్ నచ్చితే తక్కువకైనా చేస్తాను'' అంటూ సెలవిచ్చిందీ సుందరి.

తన తాజా మలయాళం మూవీ గోధ అక్కడ హిట్ అయ్యింది. ఇప్పుడు కోలీవుడ్ లో సినిమా మాయ ఫిల్మ్ ఫేమ్ డైరెక్టర్ అశ్విన్ శరవణన్ డైరెక్ట్ చేయబోతున్న మరో తమిళ్ సినిమాలో ఆఫర్ కొట్టేసింది

,  ,  ,  ,  ,