Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jun-2015 12:20:34
facebook Twitter Googleplus
Photo

'ముకుంద' సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన మెగా ఫ్యామిలీ తాజా హీరో వరుణ్ తేజ్ నటించే మరో సినిమా కన్ఫర్మ్ అయింది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దీనికి దర్శకత్వం వహిస్తాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని నేడు నిర్మాత మీడియాకు తెలియజేశారు. "చంద్రకళ నుంచి మేం నిర్మించిన చిత్రాలన్నీ సూపర్ హిట్టయ్యాయి. ఇప్పుడు వరుణ్ తేజ్, పూరీ కాంబినేషన్లో నిర్మించే చిత్రానికి అద్భుతమైన కథ రెడీ అయింది. ఈ ప్రాజక్ట్ మా బ్యానర్లోనే భారీ చిత్రమవుతుంది. ఈ నెలలోనే దీనిని ప్రారంభిస్తాం. మిగతా వివరాలు త్వరలో ప్రకటిస్తాం" అన్నారు. కాగా, నితిన్ తో తాను చేయాల్సిన సినిమా కేన్సిల్ అవడంతో ఆ కథతోనే పూరీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు సమాచారం.

,  ,  ,  ,  ,