Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Apr-2016 11:37:32
facebook Twitter Googleplus
Photo

భలే భలే మగాడివోయ్ హిట్‌తో దర్శకుడిగా స్టార్ స్టేటస్ కొట్టేసిన మారుతి, ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌తో బాబు బంగారం పేరుతో ఓ రొమాంటిక్ కామెడీ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. వెంకీ సరసన నయనతార హీరోయిన్‍గా నటిస్తోన్న ఈ సినిమాలో వెంకటేష్ తనదైన శైలిలో ఓ కామెడీ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. సితార క్రియేషన్స్‌తో కలిసి సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని తెలుగు సంవత్సరాది అయిన ఉగాది రోజున విడుదల చేయనున్నట్లు తెలిసింది.
జనవరి నుంచి ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ నెలచివరికల్లా షూటింగ్ పూర్తిచేసుకుంటుంది. ఆ తరువాత నిర్మాణంతర కార్యక్రమాలు పూర్తిచేసి జులైలో ఈ సినిమాని విడుదల చేయాలని దర్శకనిర్మాతలు నిర్ణయించినట్టు తెలిసింది. భలే భలే మగాడివోయ్ ఘనవిజయం తరువాత మారుతి దర్శకత్వం లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి.

,  ,  ,  ,  ,  ,  ,  ,