Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Aug-2016 12:30:10
facebook Twitter Googleplus
Photo

విక్టరీ వెంకటేష్ హీరోగా మారుతి దర్శకత్వంలో చేస్తున్న బాబు బంగారం చిత్రం అన్ని పనులను పూర్తి చేసుకుని ఆగష్టు 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం విడుదలయ్యే లోపు వెంకీ మరో సినిమాని మొదలుపెట్టనున్నాడని తెలుస్తోంది. అదే బాలీవుడ్ చిత్రం సాలా ఖదూస్ కు రీమేక్ గా తెరకెక్కనున్న చిత్రం.
ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా వెంకటేష్ ఈ చిత్రం కోసం బాడీ బిల్డింగ్, బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. మరోవైపు ఈ చిత్రంలోని పాటల కోసం మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని కూడా వరిజినల్ వర్షన్ ను డైరెక్ట్ చేసిన సుధా కొంగర డైరెక్ట్ చేస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,