Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Oct-2017 11:22:37
facebook Twitter Googleplus
Photo

ఫ్యామిలీ - యాక్షన్ అలాగే హిస్టారికల్ వంటి సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో విక్టరీ వెంకటేష్. అయితే గత కొంత కాలంగా ఈ విక్టరీ హీరోకి సరైన విజయం దక్కడం లేదు. రీసెంట్ గా మేనల్లుడి పెళ్లిలో ఎంతో సందడి చేసిన వెంకటేష్ ఒక పదిరోజుల పాటు విహార యాత్రలకు వెళ్లాలని ప్లాన్స్ వేసుకున్నాడట.

ఒక పది రోజుల పాటు తన స్నేహితులతో యూరోప్ ట్రిప్ కి వెళుతున్నాడట. ఇదేదో సరదా ట్రిప్ కాదు.. ఒక ఆధ్యాత్మిక ట్రిప్ అని తెలుస్తోంది. వెంకీకి విహార యాత్రలంటే చాలా ఇష్టం. అంతే కాకుండా ఆయన ఆధ్యాత్మిక పర్యటనలు కూడా చాలా చేస్తారు. ఆధ్యాత్మిక గురువు రమణ మహర్షి ని అయితే చాలా ఫాలో అవుతారు. ఆ తరహాలో ఆలోచించే స్నేహితులు వెంకటేష్ కి ఎక్కువగా ఉన్నారు. ఎప్పుడన్నా టెన్షన్ గా ఫీల్ అయినపుడు వెంకటేష్ ఆధ్యాత్మిక పర్యటనలు బాగా చేస్తారట.

ఇక వెంకటేష్ సినిమాల విషయానికి వస్తే నెక్ట్ తేజ దర్శకత్వంలో సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు.

,  ,  ,  ,