Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Nov-2016 11:33:20
facebook Twitter Googleplus
Photo

జూబిలీ హిల్స్ ఫిలిం నగర్.. ఎప్పుడు సందడి సందడిగా ఉండే ప్రాంతమే. సినీ ప్రముఖులంతా తిరిగే ఏరియా కావడంతో ఈ పోష్ ఏరియా నిరంతరం కాస్ట్ లీ కార్లతో హడావిడిగా ఉంటుంది. ఫిలిం నగర్ రోడ్ స్టార్టింగ్ లో వెంకటేష్ ఇల్లు అంటే ఎవరికైనా తెలిసిపోతుంది. ప్రస్తుతం వెంకీ మణికొండకు షిఫ్ట్ అయిపోవడంతో.. ఫిలింనగర్ లో ఆయన ఇల్లు వేరే వ్యాపారాలకు రెంట్ కి ఇచ్చేశారు.

వెంకీ హౌస్ తో పాటు.. పక్కనే ఉన్న ఖాళీ స్థలం కూడా కలిపి ఓ చిన్నపాటి బిజినెస్ సెంటర్ అయింది. ఫుడ్ జాయింట్ సముదాయంగా మారిపోవడంతో.. బెంజ్ కార్లు- రిచ్ బాబులతో అర్ధరాత్రి వరకు ఇప్పుడా హౌస్ ఫుల్లు బిజీగా మారిపోయింది. ఫిలిం నగర్ సెంటర్లో ఈ రేంజ్ హ్యాంగవుట్ సెంటర్ వేరేదేమీ లేకపోవడం కూడా.. ఇక్కడ బిజినెస్ మూడు జ్యూస్ లు.. ఆరు కాఫీలు అన్న రేంజ్ లో సాగిపోతోంది.

వెంకీ అప్పటి ఇంట్లో ప్రస్తుతం లైవ్ మ్యూజిక్ తో థీమ్ కాఫీ షాప్.. డిఫెరెంటె కాన్సెప్ట్ తో ఆకట్టుకుంటున్న రెస్టారెంట్.. ఇంపోర్టె ఐస్ క్రీమ్స్ విక్రయించే ఓ ఐస్ క్రీమ్ షాప్.. డిఫరెంట్ కాంబినేషన్స్ లభించే జ్యూస్ స్టాల్ లు ఉన్నాయి. పేరు మోసిన బ్రాండ్స్ అనేకం ఇక్కడ లభ్యమవుతుండడంతో.. పోష్ ఏరియాలో అల్ట్రాపోష్ ఫుడ్ సెంటర్ గా వెంకీ ఇల్లు మారిపోయింది.

,  ,  ,  ,  ,