Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Feb-2016 15:57:53
facebook Twitter Googleplus
Photo

దర్శకుడు వంశీ అంటే ఓ ట్రేడ్ మార్క్. ఆయన మూవీస్ అంటే ఓ విజువల్ వండర్స్. వంశీ పిక్చరైజేషన్ అంటే మార్వలెస్.. ఇవీ వంశీ నుంచి ఓ సినిమా వస్తోందంటే ప్రేక్షకులకు ఉండే అంచనాలు. మరి అలాంటి దర్శకుడు తన 25 సినిమా చేస్తున్నాడంటే.. సిల్వర్ జూబ్లీ స్పెషల్ మూవీగా మరేదో కొత్తదనం పరిచయం చేస్తాడని అందరూ భావిస్తారు. వెన్నెల్లో హాయ్ హాయ్ విషయంలోనూ ఇలాగే అనుకుని థియేటర్స్ కి వెళ్లిన వాళ్లు నెత్తీ నోరు కొట్టేసుకుంటున్నారు.

వంశీ అనే మార్క్ అక్కడక్కడా తప్పితే ఎక్కడా కనిపించకపోవడం హీరో కేరక్టరేజన్ హీరోయిన్ ని వెతుక్కునే సన్నివేశాలు.. ప్రేక్షకులను మైమరిపించకపోగా.. తల బద్దలు కొట్టుకోవాలనేంత కసి తెప్పిస్తున్నాయని ప్రేక్షకులు వాపోతున్నారు. అసలు ఏ మాత్రం ప్రమోషన్ లేకపోయినా వంశీ పేరు చూసి థియేటర్స్ కి వెళ్లినోళ్లకు పాత చింతకాయ స్టోరీతో అంత కంటే పాచిపోయిన స్క్రీన్ ప్లే వందల సినిమాల్లో చూసి విసుగెత్తిపోయిన సీన్స్... ప్రేక్షకులను ఒక నిమిషం కూడా ఆకట్టుకోలేకపోయాయనే టాక్ వినిపిస్తోంది. అసలు దివంగత సంగీత దర్శకుడు చక్రి అందించిన మ్యూజిక్ గనక లేకపోతే.. థియేటర్స్ నుంచి జనాలు పారిపోవడం ఖాయం. ఉన్నంతలో ఆ మ్యూజిక్ ఒకటే కాస్త ఆడియన్స్ ను నిలవనీయగలగింది.

ఏ కోశానా వంశీ మార్క్ కనిపించని ఈ సినిమాకి.. వెన్నెల్లో హాయ్ హాయ్ అనే టైటిల్ ఎందుకు పెట్టారా అన్నది అందరికీ వస్తున్న మొదటి డౌట్. వంశీ జీ.. వెన్నెల్లో హాయి లేదంట.. అంతా మీ బాదుడే అంటున్నారు వినిపించిందా. మొత్తానికి ఈ మూవీ రిలీజ్ కాకుండా ఇన్నేళ్లు ఆగిపోవడానికి అసలు కారణమేంటో ఇప్పుడు బోధపడింది జనాలకు.

,  ,  ,  ,