Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Dec-2014 17:43:07
facebook Twitter Googleplus
Photo

డిఫరెంట్ కాన్సెప్టుతో ఫస్ట్ లుక్ ను విడుదల చేసి, సంచలనం సృష్టించినట్టుగానే, ఆడియో వేడుకను కూడా చాలా వినూత్నంగా నిర్వహించడానికి 'గోపాల గోపాల' సినిమా టీమ్ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం వెరైటీ కాన్సెప్టును రూపొందిస్తున్నట్టు, ప్రస్తుతానికి దానిని గోప్యంగా వుంచినట్టూ సమాచారం. అయితే, ప్రేక్షకులు మాత్రం ఈ వేడుకను చూసి థ్రిల్ అవుతారని అంటున్నారు. ఈ నెల చివరి వారంలో ఈ వేడుకను హైదరాబాదులో అభిమానుల సమక్షంలో భారీ ఎత్తున నిర్వహిస్తారు. పవన్ కల్యాణ్, వెంకటేష్ తొలిసారిగా కలసి నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే అటు ప్రేక్షకులలోనూ, ఇటు బిజినెస్ వర్గాలలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ బాబు, శరత్ మరార్ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ఇది ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

,  ,  ,  ,  ,  ,  ,