Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Dec-2017 13:10:33
facebook Twitter Googleplus
Photo

అర్జున్ రెడ్డి గా వచ్చి మాస్ క్లాస్ అని తేడా లేకుండా అందరికి బాగా నచ్చేశాడు. ప్రేక్షకులకు నచ్చిన హీరోతో ఒక ప్రయోగాత్మకైనా సినిమా చేయాలనీ కొందరు దర్శకులు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. అదే తరహాలో ఇప్పుడు బడా దర్శకులు అర్జున్ రెడ్డి హీరోతో ఒక మంచి సినిమాను చేయాలనీ కొత్తగా కథలను రాసుకుంటున్నారు.

అయితే ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా కొంత మంది స్టార్ డైరెక్టర్స్ వచ్చి విజయ్ తో సినిమా చేయాలనీ చర్చలు జరుపుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే గత కొంత కాలంగా స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఒక మల్టి స్టారర్ ని తెరకెక్కించడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే శింబు - అరవింద్ స్వామి - విజయ్ సేతుపతి లను కథానాయకులుగా ఎంచుకున్నాడు. ఇక జ్యోతిక - ఐశ్వర్య రాజేశ్ - ఫాహద్ ఫాసిల్ వంటి వారు కూడా సినిమాలో నటించడానికి ఒకే చెప్పారు.

అయితే మరొక ముఖ్యమైన పాత్రకు టాలీవుడ్ నుంచి ఒక హీరోను తీసుకోవాలని దర్శకుడు ఆలోచిస్తున్నాడు. అంతకుముందు నానిని కలిసినట్లు వార్తలు వచ్చాయి. అయితే రీసెంట్ గా విజయ్ దేవరకొండకు మణిరత్నం కథను వినిపించడంతో ముందుగా ఒకే చెప్పాడని అయితే ఆ తర్వాత రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలు మెప్పించకపోవడంతో మనోడు నో చెప్పనట్లు టాక్.

,  ,  ,  ,  ,