Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Sep-2015 17:01:49
facebook Twitter Googleplus
Photo

బాహుబలి - భజరంగి భాయిజాన్ లాంటి బ్లాక్ బస్టర్ లకు కథ అందించి దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయారు విజయేంద్ర ప్రసాద్. ఆయన తర్వాత ఏ సినిమా కోసం పెన్ను పడతారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే బాహుబలి-2 స్క్రిప్టుకు మెరుగులు దిద్దే పని పూర్తి చేసిన పెద్దాయన.. కన్నడలో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు హీరోగా పరిచయమవుతున్న సినిమాకు కూడా కథ అందించాడు. మరోవైపు బాలీవుడ్ లో ఓ అడల్ట్ కామెడీకి రచన చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కన్నడలో ఓ సైన్స్ ఫిక్షన్ చేస్తాడన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. ఐతే ఈ రెండు ప్రాజెక్టుల సంగతేంటో కానీ.. ఓ సెన్సేషనల్ కాన్సెప్ట్ తో స్వయంగా మెగా ఫోన్ పట్టడానికి విజయేంద్రుడు రెడీ అవుతున్నట్లు సమాచారం.

ఇంతకుముందు శ్రీకృష్ణ 2006 - రాజన్న సినిమాలకు దర్శకత్వంలో వహించిన విజయేంద్ర ప్రసాద్.. మూడోసారి మెగా ఫోన్ పట్టబోతున్నాడట. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తాడట. దుల్కర్ మలయాళంతో పాటు తమిళం - తెలుగులోనూ మంచి పాపులారిటీ సంపాదించాడు. హీరోయిన్ గా కొత్తమ్మాయికి ఛాన్స్ ఇవ్వబోతున్నారట. ఆ కొత్తమ్మాయి మరెవరో కాదు.. అతిలోక సుందరి శ్రీదేవి తనయురాలు జాన్వి. ఈ అమ్మాయి హీరోయిన్ అవుతుందని రెండు మూడేళ్లుగా వార్తలొస్తున్నాయి. కానీ ఇంకా ఏ ప్రాజెక్టూ తెరమీదికి రాలేదు. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ సినిమాతో హీరోయిన్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమా తెలుగు - తమిళం - మలయాళం - హిందీ.. ఇలా నాలుగు భాషల్లో తెరకెక్కుతుందని సమాచారం.

,  ,  ,  ,