Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Jan-2017 13:13:38
facebook Twitter Googleplus
Photo

మెగా ఫ్యామిలీకి వివి వినాయక్ పై ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అందుకే మెగాస్టార్ కంబ్యాక్ మూవీ విషయంలో పెద్దగా తర్జన భర్జనలు చేయకుండా.. కత్తి రీమేక్ ను వినాయక్ చేతుల్లో పెట్టేశారు. ఖైదీ నంబర్ 150గా పొంగల్ కి వచ్చి.. ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలుకొడుతూ దూసుకుపోతోంది ఆ మూవీ.

ఇప్పుడు వినాయక్ దర్శకత్వంలో మరో చిత్రం రూపొందించేందుకు రంగం సిద్ధమవుతోంది. అది కూడా మెగా క్యాంప్ లోనే కావడం విశేషం. సాయి ధరం తేజ్ హీరోగా వినాయక్ నెక్ట్స్ మూవీ చేయనున్నాడని తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే 25కోట్ల షేర్ సాధించిన సినిమా చేసిన తేజుకి.. వినాయక్ తో సినిమా అంటే ప్రమోషన్ లభించినట్లే. మాస్ సినిమాలు తీయడంలో.. హీరోయిజంను ఎలివేట్ చేయడంలో వినాయక్ ను మించిన డైరెక్టర్ మరొకరు లేరనే విషయంలో సందేహం అవసరం లేదు.

తేజుతో వినాయక్ చేయనున్న సినిమా కూడా మాస్ మూవీనే అని తెలుస్తోంది. మార్చిలో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయంటున్నారు. వరుస హిట్స్ తో జోరు మీదుండి.. రీసెంట్ గా తిక్కతో బోల్తా కొట్టిన సాయి ధరం తేజ్ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో విన్నర్ మూవీ చేస్తున్నాడు. మరోవైపు నక్షత్రంలో స్పెషల్ కేరక్టర్ లో తేజు కనిపించనున్నాడు.

,  ,  ,  ,  ,