Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Feb-2017 15:49:51
facebook Twitter Googleplus
Photo

మెగాహీరో సాయిధరమ్ తేజ్ నటించిన విన్నర్ ఈనెల 24న విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించి థమన్ అందించిన ఆడియోలో ఒక్కో పాటను ఒక్కో స్టార్ చేత విడుదల చేయిస్తూ వచ్చిన టీమ్ అభిమానుల్లో మంచి అంచనాలనే రేకెత్తించింది. ఇక తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌కు కూడా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు. రేపు (ఫిబ్రవరి 9న) సోషల్ మీడియాలో నేరుగా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.
అదేవిధంగా ఈనెల 19న పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనుంది. సుప్రీమ్‌ తో సూపర్ హిట్ కొట్టిన ధరమ్ తేజ్, ఆ తర్వాత తిక్క తో నిరాశపరిచినా, విన్నర్‌తో మళ్ళీ తన రేంజ్ హిట్ కొడతానన్న ధీమాతో ఉన్నారు. సాయిధరమ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు నిర్మించారు.

,  ,  ,  ,  ,