Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jul-2015 12:58:15
facebook Twitter Googleplus
Photo

ఒక వైపున అనుష్క నటించిన 'బాహుబలి' .. 'రుద్రమదేవి' సినిమాలు విడుదలకి ముస్తాబవుతూ వుండగా, మరో వైపున ఆమె కథానాయికగా 'జీరో సైజ్' సినిమా తెరకెక్కుతోంది. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. త్వరలో షూటింగ్ పార్టును పూర్తి చేసుకోనున్న ఈ సినిమా ఆడియోను, మలేసియాలో గానీ సింగపూర్లో గాని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఈ రెండు ప్రదేశాల్లో ఎక్కడ .. ఎప్పుడు ఈ పాటల పండుగను జరపనున్నారనే విషయంలో త్వరలోనే స్పష్టత రానుంది. తెలుగు .. తమిళ భాషా ప్రేక్షకులను పలకరించనున్న ఈ సినిమాకి, భారీస్థాయిలో ప్రచారాన్ని కల్పించడం కోసమే ఆడియో వేడుకను విదేశాల్లో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పీవీపీ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో అనుష్క కొత్తగా కనిపించనుంది. ఆర్య .. సోనాల్ చౌహాన్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ నెలలో ఆడియో వేడుకను నిర్వహించి, ఆ వెంటనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

,  ,