Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Aug-2016 14:20:19
facebook Twitter Googleplus
Photo

కుటుంబ క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడిగా శ్రీ‌కాంత్ అడ్డాలకు మంచి పేరుంది. కొత్త‌బంగారు లోకం, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమాల‌తో త‌న పంథా నిరూపించుకొన్నాడాయ‌న‌. ముకుంద ఓకే అనిపించింది. బ్ర‌హ్మోత్స‌వం మాత్రం డిజాస్ట‌ర్ జాబితాలో చేరిపోయింది. ఆ సినిమా శ్రీ‌కాంత్ కెరీర్‌పై దారుణ‌మైన ప్ర‌భావాన్ని చూపించింది. అంత‌కు ముందు అడ్వాన్సులు ఇచ్చిన‌వాళ్లంతా సైడైపోయారు. శ్రీ‌కాంత్ చేతిలో సినిమాలేం లేవిప్పుడు.

అయితే.. ఈ ద‌శ‌లో దిల్‌రాజు ఈ ద‌ర్శ‌కుడ్ని ఆదుకొంటున్న‌ట్టు ఆమధ్య వార్త వచ్చింది. కొత్త‌బంగారు లోకం, సీత‌మ్మ‌.. ఈ రెండు సినిమాలూ దిల్ రాజు బ్యాన‌ర్ నుంచి వ‌చ్చిన‌వే. ఆ సంస్థ‌కు ఈ సినిమాలు లాభాల‌తో పాటు మంచి పేరునీ తీసుకొచ్చాయి. ఆ గౌర‌వంతోనే దిల్‌రాజు అడ్డాల‌కు మ‌రో ఛాన్స్ ఇచ్చాడ‌ని చెప్పుకొచ్చారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

ప్ర‌స్తుతం ఈ సినిమా స్క్రిప్టు ప‌నుల్లో బిజీగా ఉన్నాడట శ్రీకాంత్ . ఆయనిదంతా వెరైటీ. స్క్రిప్టు లో వున్నప్పుడు ఎవరికీ కాంటాక్ట్ లో వుండడాయన. ఫోన్ స్విచ్ ఆఫ్ అన్నమాట. అయితే ఈ సినిమాపై ప్రస్తుతానికి వున్న సమాచారం ఏమిటంటే.. ఇది బడా సినిమా కాదు.మీడియం సినిమా. కొత్తబంగారం తరహాలో ల‌వ్ స్టోరీ. స్క్రిప్ట్ లాక్ అయినవెంటనే దీనిపై ఓ ప్రకటన వచ్చే అవకాశం వుంది.

,  ,  ,  ,  ,