Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Feb-2017 10:05:33
facebook Twitter Googleplus
Photo

సినిమాల ప్రమోషన్ అంటే.. ఒకప్పటికి ఇప్పటికీ చాలానే మార్పులు వచ్చేశాయి. ఒక్క లుక్ తో కానీ.. టైటిల్ తో కానీ అట్రాక్ట్ చేసేసే పరిస్థితి లేదు. కంటెంట్ కళ్ల ఎదురుగా కనిపిస్తే తప్ప.. అందరినీ నమ్మే సిట్యుయేషన్ అస్సలు లేదు. వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడుతున్న పూరీ జగన్నాధ్.. తాను తీస్తున్న రోగ్ మూవీకి రీసెంట్ గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు.

దీనికి భయంకరమైన రెస్పాన్స్ వచ్చేసిందంటూ పూరీ టీం ప్రచారం కూడా స్టార్ట్ చేసేసింది. ఫస్ట్ లుక్ సంగతేమో కానీ.. ఈ పబ్లిసిటీనే ఎక్కువగా షాక్ ఇస్తోంది. హీరో ఇషాన్ ను కాళ్లకు తాళ్లు కట్టి తిరగేసి వేలాడేసిన ఫోటో.. దీనికి మరో చంటిగాడి ప్రేమకథ అనే ట్యాగ్ లైన్ అంతే. ఈ లుక్ చూసి బంగీ జంప్ అని కొందరు అంటే.. తిరగేసి వేళ్లాడేసినట్లు అనే కామెంట్స్ వచ్చాయంతే. దానికి మించి మూవీ గురించి కానీ.. టైటిల్ గురించి కానీ.. ట్యాగ్ లైన్ గురించి కానీ.. హీరో లుక్ గురించి కానీ మాట్లాడుకునేది ఏమీ కనిపించలేదు.

ఫస్ట్ లుక్ తో సినిమా గురించి కలిగించాల్సిన ఇంప్రెషన్ విషయంలో రోగ్ డిజప్పాయింట్ చేశాడు. ఆ విషయంపై దృష్టి పెట్టడం మానేసి.. ఆ మాత్రం దానికే రెస్పాన్స్ అదిరింది.. దిమ్మ తిరిగింది అని ప్రచారం చేయడం మరీ ఆశ్చర్యం కలిగించే విషయం.

,  ,  ,  ,  ,  ,