Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Dec-2014 12:57:20
facebook Twitter Googleplus
Photo

సమంతా త్వరలో తన బాయ్ ఫ్రెండు సిద్ధార్థ్ తో జత కట్టనుంది. వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ గత కొంత కాలంగా మీడియా నిండా వార్తలు కనిపిస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలసి ఓ సినిమాలో నటించనున్నారనే వార్త ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మలయాళంలో సూపర్ హిట్టయిన 'బేంగళూర్ డేస్' చిత్రాన్ని 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీని స్క్రిప్టు వర్క్ కూడా ఇప్పటికే పూర్తయింది. ఈ సినిమా కోసం సిద్ధార్థ్, సమంతాలను దర్శకుడు ఇటీవల కలసి చర్చించాడనీ, ఈ సినిమా చేయడానికి వారిద్దరూ అంగీకరించారనీ సమాచారం. జనవరి నెలలో దీని షూటింగ్ మొదలవుతుందట!

,  ,  ,  ,  ,