Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jul-2016 11:52:29
facebook Twitter Googleplus
Photo

నందమూరి నటసింహం బాలయ్య హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం హైద్రాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక తాజాగా ఈ సినిమా విషయంలో వినిపిస్తోన్న ఓ వార్త అంతటా మంచి ఆసక్తి రేకెత్తిస్తోంది. అదే ప్రముఖ హాలీవుడ్ నటుడు నాథన్ జోన్స్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించనున్నాడన్న ప్రచారం జరగడం.
చారిత్రక నేపథ్యంలో సాగే శాతకర్ణి జీవిత కథ కావడంతో ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో శాతకర్ణి, ఓ గ్రీకు రాజుతో తలపడాల్సి వస్తుందట. ఇక ఆ పాత్ర కోసమే నాథన్ జోన్స్‌ను సంప్రదించగా ఆయన కూడా ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పారని తెలుస్తోంది. గతంలో ట్రాయ్, మ్యాడ్‌మ్యాక్స్ లాంటి బ్లాక్‌బస్టర్ హాలీవుడ్ సినిమాల్లో నాథన్ నటించారు. ఇక ఈ విషయమై క్రిష్ టీమ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా గౌతమి పుత్ర శాతకర్ణి టీమ్ కృషి చేస్తోంది.

,  ,  ,  ,  ,  ,  ,