Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Jun-2017 11:43:05
facebook Twitter Googleplus
Photo

ఇండియన్ నెంబర్ వన్ రియాలిటీ షో 'బిగ్ బాస్' మన తెలుగులో కూడా చేయబోతున్న సంగతి దానికి హోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సంగతి మనకు తెలుసు. మంచి హోస్ట్ దొరికాడు కానీ ఇప్పుడు బిగ్ బాస్ లో పోటీపడే అభ్యర్థుల కోసం చాలానే తంటాలు పడుతున్నారు టీమ్. ఎవరుని అడిగినా ముఖం చాటేస్తున్నారని అంటున్నారు. టివి సెలిబ్రిటీలు కానీ మూవీ సెలిబ్రిటీలు కానీ రావడానికి కొంచం జంకుతున్నారు అని తెలుస్తుంది. ఈ షో లో ఉండే టాస్క్ లు కొంచెం వివాదాన్ని పెంచే దిశలో ఉంటాయి.. పైగా కొన్ని నెలలు బిగ్ బాస్ ఇంటికే పరిమతం కావలిసివస్తుంది.. అందుకే ఎవ్వరూ ధైర్యం చేయట్లేదు.

కానీ ఇప్పుడు తెలుగు రైటర్ - డైరెక్టర్ - నటుడు అయిన పోసాని కృష్ణ మురళిని ఒక అభ్యర్థిగా తీసుకున్నారు అని తెలుస్తోంది. ఈ ఫస్ట్ సీజన్ కోసం పోసానికి 2.5 కోట్లు ఆఫర్ చేశారట. పోసాని ఈ షో లో పాల్గొంటున్నాడు అని తెలిసినప్పటి నుండి బిగ్ బాస్ షో లో జరిగే గందరగోళం ఇంకా ఎంత పెరుగుతుందోని అందరూ అనుకుంటున్నారు. ఇతనితో పాటుగా చాలామంది సెలిబ్రిటీలకు ఈ షోలో వచ్చి పాల్గొనండి అని ఆహ్వానం అందుతుంది అంటా. పోసాని ఈ షో కోసం చాలా సినిమాలు వదులుకోవలిసి వస్తుంది అందుకే ఈ పెద్ద మొత్తం అడిగాడట. కాకపోతే ఇంకా పోసాని ఫైనల్ చేశాడా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు.

ఇది ఇలా ఉంచితే మరోపక్క తెలుగు హిరోయిన్లు తేజస్వి మదివాడ - మధు షాలిని కూడా ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ షోకి వీళ్ళకి 15 – 20 లక్షలు వరకు ఇవ్వవచ్చు అని టాక్.

,  ,  ,  ,  ,