Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Jan-2017 12:15:49
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజుగారి వ్యవహారమే వేరుగా ఉంటుంది. ఇవాల్టి రోజు నిర్మాతకు మర్యాద ఎక్కడ ఉందని చాలామంది చెబుతుంటారు. కానీ.. దిల్ రాజు సెలబ్రిటీ స్టేటస్ చూస్తే.. నిజమే అనుకోక తప్పదు. అయితే.. ఇలాంటి ఇమేజ్ అంత తేలిగ్గా రాదని.. దానికి బోలెడంత కసరత్తు.. లెక్కలు ఉంటాయనే చెప్పాలి. రిస్క్ చేయటం.. అంచనా వేయటంతో పక్కాగా ఉండటం కూడా దిల్ రాజుకు సెలబ్రిటీ హోదా దక్కటానికి కారణంగా చెప్పాలి.

మద గజాల్లాంటి పెద్ద హీరోలు ఒకరికి ఒకరు పోటాపోటీగా బరిలోకి దిగిన వేళ.. వారి సినిమాలకు మూడు.. నాలుగు రోజుల ఆలస్యంగా సినిమా తీసుకురావటం అంటే మాటలా? కానీ.. అలాంటి రిస్క్ ను చేసేందుకు ఏ మాత్రం వెనక్కి దక్కలేదు దిల్ రాజు. తన తాజా శతమానం భవతి సినిమా రిలీజ్ డేట్ ప్రకటించినప్పుడు వారించిన వాళ్లే కాదు హెచ్చరించినోళ్లు ఉన్నారని చెబుతారు.

ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళుతున్నాడు.. దెబ్బ పడిద్దేమోనని దిల్ రాజును అభిమానించే కొందరు ఆందోళన పడ్డారు కూడా. అయితే.. శతమానం భవతి విషయంలో పూర్తి ధీమాతో ఉండటం కనిపిస్తుంది. అందుకు తగ్గట్లే ఆ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ కావటమే కాదు.. సంక్రాంతి బరిలో నిలిచిన భారీ సినిమాలతో పాటు.. విజయాన్ని సొంతం చేసుకోవటం పూర్తిగా దిల్ రాజు నిర్ణయమే కారణంగా చెప్పాలి. ఆయన అంచనా నూటికి నూరుపాళ్లు తప్పుకాకుండా ఉండటమేకాదు.. సినిమా లాభాల బాట పట్టినట్లుగా చెబుతున్నారు. రాజుగారు లెక్కలేసుకొని బరిలోకి దిగితే మాత్రం తిరుగులేదన్న మాట ఇప్పుడు ఇండస్ట్రీలో పలువురి నోట వినిపిస్తోంది. రిస్క్ లోనే విజయం ఉంటుందని ఇందుకే అంటారేమో.

,  ,  ,  ,