Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jul-2017 13:49:34
facebook Twitter Googleplus
Photo

దసరా పండుగ వచ్చేందుకు ఇంకా రెండు నెలలకు పైగా సమయం ఉంది. సరిగ్గా చెప్పాలంటే.. సెప్టెంబర్ 21 నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండగా.. ఆ నెల 30న విజయ దశమి పండుగతో ఈ హంగామా ముగియనుంది. పండుగలు వచ్చేందుకు ఇంకా రెండు నెలలకు మించి సమయం ఉంది కానీ.. అప్పటి పండుగకు టాలీవుడ్ ధమాకా మొత్తం ఫిక్స్ అయిపోయింది.

సెప్టెంబర్ 21న దసరా సీజన్ ప్రారంభం రోజునే జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ రిలీజ్ అయిపోనుంది. ఈ డేట్ ను ముందుగా అనౌన్స్ చేసిన ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్.. ఎట్టిపరిస్థితుల్లోనూ డేట్ మార్చే సమస్య లేదంటున్నాడు. సెప్టెంబర్ 30న నందమూరి బాలకృష్ణ నటించిన పైసా వసూల్ రిలీజ్ అవుతుందని.. పూరీ జగన్నాధ్ ఎప్పుడో చెప్పేశాడు. ఈ డేట్ ను ఒకవేళ సెప్టెంబర్ 1కి మారిస్తే మాత్రం చెప్పలేం. రీసెంట్ గా సెప్టెంబర్ 27 డేట్ ను మహేష్ బాబు స్పైడర్ కోసం బుక్ చేసుకున్నాడు. ఇక్కడితో దసరా ధమాకా అయిపోతుందని అనుకుంటే పొరపాటే.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందుతున్న రాజా ది గ్రేట్ కు ఇప్పుడు రిలీజ్ డేట్ ఇచ్చేశారు. అక్టోబర్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మూడు పెద్ద సినిమాల హంగామా అయిపోయిన తర్వాత.. దీపావళి సెలవలకు ముందు విడుదల కానుండడంతో.. మాస్ మహరాజ్ దీపావళిని బాగానే క్యాష్ చేసుకునే అవకాశాలున్నాయి.

,  ,  ,  ,