Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Jun-2017 10:18:12
facebook Twitter Googleplus
Photo

శివగామి లాంటి పాత్రను కాదన్నందుకు శ్రీదేవి ఎదుర్కొన్న విమర్శలు.. వ్యతిరేకతా అంతా ఇంతా కాదు. అందుకే ఒక సినిమాను కాదని అనేముందు కాస్త ముందు వెనుకా ఆలోచించుకోవాలి. బాలీవుడ్ భామ పూజా హెగ్డే కూడా తన కెరీర్ ను మలుపు తిప్పే ఒక సినిమాను ముందు కాదనే అందట. కానీ తర్వాత మనసు మార్చుకుని ఆ సినిమాను ఓకే చేసింది. అదే ఇప్పుడు ఆమె కెరీర్ ను మార్చేసింది. ఆ సినిమా మరేదో కాదు.. దువ్వాడ జగన్నాథం. ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చి ఉండొచ్చు కానీ.. పూజా హెగ్డే పాత్రలో అంత విషయమూ లేకపోవచ్చు కానీ.. ఆమె కెరీర్ కు ఈ సినిమా పెద్ద ప్లస్ అయిందనడంలో సందేహాల్లేవు.

తెలుగులో చేసిన తొలి రెండు సినిమాల్లో పద్ధతిగా.. ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన పూజా క్యూట్ హీరోయిన్ అని పేరు తెచ్చుకుంది. ఐతే టాలీవుడ్లో పెద్ద స్థాయికి వెళ్లాలంటే క్యూట్ అని కాకుండా హాట్ అనిపించుకోవడం ముఖ్యం. దువ్వాడ జగన్నాథం పూజాకు అలాంటి ఇమేజే తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు ఆమె గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందంగా ఉంటూనే సెక్సీ లుక్స్ తోనూ ఆకట్టుకోవడం.. స్టార్ హీరోల పక్కన కనిపించేందుకు అవసరమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉండటం పూజాకు కలిసొస్తోంది. డీజే తర్వాత ఆమె డిమాండ్ మామూలుగా లేదు. వరుసగా పెద్ద పెద్ద ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం.

బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు ఆమె కోటిన్నర దాకా పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు సరసన కూడా పూజా జత కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతగా పూజా కెరీర్ ను మలుపు తిప్పిన ‘డీజే’కు ముందుగా నో చెప్పిందట పూజా. ముకుంద.. ఒక లైలా కోసం సినిమాల తర్వాత బాలీవుడ్డుకెళ్లిపోయిన పూజా.. మళ్లీ టాలీవుడ్ రావడానికి ఆసక్తి చూపించలేదట. అక్కడి జనాలు కూడా ఈ విషయంలో డిస్కరేజ్ చేశారట. కానీ అల్లు అరవింద్ తనకు సన్నిహితుడైన బాలీవుడ్ ప్రముఖుడి ద్వారా ఆమెను డీజే కు ఒప్పించాడట. ఇక్కడ హీరోయిన్ల కొరత గురించి చెప్పి.. ఈ క్రేజీ మూవీలో చేస్తే కెరీర్ మంచి టర్న్ తీసుకుంటుందని చెప్పి ఆమెతో ఓకే చేయించాడట. ఆయన అంచనా ఫలించి పూజా ఒక్కసారిగా టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది.

,  ,  ,  ,  ,