సంక్రాంతి ? 2016కి స్పెషల్. ఈ సంక్రాంతికి బరిలో ఉన్న నాలుగు చిత్రాలు విజయానందుకొన్నాయి. బాలయ్య ?డిక్టేటర్?, జూ.ఎన్ టీఆర్ ?నాన్నకు ప్రేమతో?, నాగ్ ?సోగ్గాడే చిన్ని నాయన?, శర్వానంద్ ?ఎక్స్ ప్రెస్ రాజా? పొంగల్ పోటీకి దిగాయి. ఈ నాలుగు చిత్రాలు కూడా హిట్ కొట్టడం విశేషం. పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమా గా వచ్చిన శర్వా ఎక్స్ ప్రెస్ రాజా సంచలన విజయాన్ని నమోదు చేసింది.
ఇప్పుడు సంక్రాంతి ? 2017కి కూడా సేమ్ పోటీ రిపీట్ కానుండటం విశేషం. ఇప్పటికే బాలయ్య ?గౌతమీ పుత్రశాతకర్ణి? , నాగార్జున ?ఓం నమో వేంకటేశాయ? సినిమాలు పొంగల్ పోటికి ఖర్చీప్ వేసి ఉంచారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలతో మరోసారి ఢీ అనేందుకు రెడీ అవుతున్నాడు శర్వానంద్. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న శతమానంభవతి సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసి.. మరోసారి సత్తా చాటలని ప్లాన్ చేసుకుంటున్నాడు శర్వానంద్. ఒక్క ఎన్ టీఆర్ ఒక్కడే పోటీలో లేడు. కానీ? ఎన్ టీఆర్ పోటీ నుంచి తపుకొన్నా.. ఈసారి మెగాస్టార్ పోటీలోకి దిగుతుండటంలో పోటీ మరింత రసవత్తరంగా మారనుంది.