Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-May-2016 12:02:15
facebook Twitter Googleplus
Photo

సెన్సేషనల్ స్టార్ సూర్య మూడు విభిన్న పాత్రలలో అలరించిన 24 సినిమా ఘనవిజయం సాధించడమేకాక భారతీయ చిత్రానికి సౌత్ ఫిలిం ఇండస్ట్రీ స్థాయిని మరోసారి రుజువుచేసింది.

తమిళ స్టార్ నటుడు - తెలుగు దిగ్గజ దర్శకుడు - ఆస్కార్ సాధించిన మ్యుజీషియాన్ - ఇంటర్నేషనల్ స్థాయి సినిమాటోగ్రఫీ ఇవన్నీ ఈ సినిమాకు బలాన్ని అందించాయి. అత్యంత క్లిష్టమైన సబ్జెక్ట్ ని అత్యంత తేలికగా తెలుపడంలో దర్శకుడు విజయం సాధించాడు.

అద్భుతమైన రేటింగ్స్ తో ప్రాఫిట్ జోన్ లోకి సాగిపోతున్న ఈ సినిమా ఘన విజయం సాధించింది మాత్రం ఓవర్ సీస్ లోనే అని చెప్పాలి. తమిళ మాతృకతో పోలిస్తే తెలుగు వెర్షన్ కి ఎక్కువ ప్రజాదరణ లభిస్తుంది. అయితే భారతదేశంలో కంటే విదేశాలలో ఈ చిత్రానికి లభిస్తున్న ఆదరణ చూస్తుంటే మన సినిమా సత్తా ఇది అని గర్వంగా చెప్పుకునే సందర్భం కలుగుతుంది.

,  ,  ,  ,  ,  ,  ,