Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Nov-2016 16:42:32
facebook Twitter Googleplus
Photo

అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన సాహసం శ్వాసగా సాగిపో అన్న సినిమా ఈ శుక్రవారమే విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. రొమాన్స్ జానర్లో ?ఏమాయ చేశావే? లాంటి క్లాసిక్ హిట్ ఇచ్చిన దర్శకుడు గౌతమ్ మీనన్ ? చైతూల కాంబినేషన్ రిపీట్ కావడంతో ఈ సినిమాపై టీజర్ విడుదలైనప్పట్నుంచే ఎక్కడిలేని అంచనాలు బయలుదేరాయి. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల సంవత్సరం నుంచీ ఈ సినిమా వాయిదా పడుతూనే వస్తోంది. ఈ సినిమా అయిపోయిన తర్వాత మొదలైన ప్రేమమ్ కూడా విడుదలై మంచి హిట్‌గా నిలిచింది.
ఇక ఇన్నాళ్లు ఎదురుచూయించిన ఈ సినిమా ఎట్టకేలకు ఇప్పటికి ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు పక్కాగా సిద్ధమైపోయింది. రొమాన్స్, యాక్షన్ కలగలిసిన ఈ సినిమా ఈవారం సోలో రిలీజ్‌గా వస్తోంది. కాగా ప్రధాని నరేంద్ర మోడీ నల్లధనంపై పోరాటంలా 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడంతో ఇప్పుడు ప్రజలంతా జాగ్రత్తగా ఖర్చు పెట్టడం మొదలుపెట్టారు. ఏటీఎం‌లు కూడా పనిచేయకపోవడం సినిమా ఓపెనింగ్స్‌ను దెబ్బతీయనుంది. ఇలాంటి పరిస్థితుల్లో వస్తోన్న ఈ సినిమా ఓపెనింగ్స్ విషయంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కున్నా, టాక్ బాగుంటే ఆ తర్వాతైనా నిలబడుతుందని ఆశించొచ్చు. ప్రేమమ్‌తో సోలో రిలీజ్ దక్కించుకోలేకపోయిన చైతూ సాహసం శ్వాసగాతో దక్కించుకున్నా, పరిస్థితి వేరేలా ఉంది.

,  ,  ,  ,  ,  ,