Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Jun-2016 12:01:46
facebook Twitter Googleplus
Photo

దాదాపు నాలుగు దశాబ్దాల కాలంగా సూపర్ స్టార్ రజనీకాంత్ కి రోజు రోజుకి క్రేజ్ పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. ప్రస్తుతం ?కబాలి?, ?రోబో 2.0? సినిమాలతో సంచనాలు సృష్టిస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు మరో సంచలనానికి కారణం అయ్యాడు. అదేమిటంటే ట్విట్టర్ లో తనని ఫాలో అవుతున్న వారి సంఖ్య ఇప్పుడు 3 మిలియన్ లు దాటడమే దీనికి కారణం.
2014 మే నెలలో ట్విట్టర్ జాయిన్ అయిన కేవలం రెండేళ్ల కాలంలోనే ఈ రికార్డు సాధించడం విశేషం. ఇది ఇలా ఉండగా సూపర్ స్టార్ రజనీ ఇప్పటి వరకు కేవలం 29 ట్విట్స్ మాత్రమే చేయడం విశేషం. రజనీ తరువాత త్రిష 2.6 మిలియన్స్ ఫాలోవర్స్ తో రజనీ తరువాత ఉండగా ఆ తరువాత సమంత 2.4 మిలియన్స్ ఫాలోవర్స్ తో మూడో స్థానంలో ఉంది. త్వరలోనే తెలుగు, తమిళ్ లో విడుదల అవుతున్న రజనీకాంత్ నటించిన ?కబాలి? సినిమాకోసం అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

,  ,  ,  ,  ,