Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Oct-2016 10:59:30
facebook Twitter Googleplus
Photo

బాహుబలి ది కంక్లూజన్ కు తుది మెరుగులు దిద్దడంలో భాగంగా.. భల్లాల దేవుడు పాత్రధారి దగ్గుబాటి రానా సిద్ధమైపోయాడు. బాహుబలి రెండో భాగంలో వయసు మీరిన భల్లాల దేవుడితో పాటు.. కుర్ర భల్లాలుడి కేరక్టర్ కూడా కనిపిస్తుంది. అందుకే ఏజ్డ్ కేరక్టర్ అయిపోయాక.. యంగ్ భల్లాలుడి పాత్రకు రెడీ అయిపోయాడు రానా. కండలు తిరిగిన దేహంతో ఈ దగ్గుబాటి హీరో ఫోటో ఇప్పటికే నెట్ లో తెగ హల్చల్ చేస్తోందని ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే ఈ బరువల కహానీ ఏంటో మీరే వినండి.

'వయసు మీరిన భల్లాల కేరక్టర్ స్ట్రాంగ్ గాను దిట్టంగాను ఉంటుంది. అందుకే ఆ పాత్ర కోసం 108-110 కేజీలకు పెరిగాను. అదే పాత్ర యంగ్ గా ఉన్నపుడు కూడా శక్తివంతంగానే కనిపిస్తుంది. కానీ కొంచెం సన్నగా కనిపించాలి. అందుకే 92-93 కిలోలకు తగ్గించుకున్నాను' అని చెప్పాడు రానా. అలాగని ఇలా మారిపోవడం ఏమీ సింపుల్ కాదు. అటు కార్డియోతో పాటు.. ఇటు వెయిట్ ట్రైనింగ్ ని కూడా కంటిన్యూగా తీసుకోవాల్సి వచ్చింది. 'గత ఐదు నెలలుగా ప్రతీ రోజూ రెండున్న గంటల పాటు వర్కవుట్ చేస్తూనే ఉన్నాను' అని చెప్పాడు రానా.

ఫుడ్ విషయంలో కూడా చాలానే కేర్ తీసుకున్నాడు రానా ట్రైనర్ కునాల్ గిర్. ఆయిల్ లేకుండా కార్బొహైడ్రేడ్స్.. ప్రొటీన్స్ అందేలా ఆహారం అందించడంలో జాగ్రత్తలు పాటిస్తున్నాడీ ట్రైనర్. 'ప్రతీ రెండున్నర గంటలకు ఆహారం తీసుకుంటున్నా. ఓ న్యూట్రిషనిస్ట్ నా ఆహారాన్ని ఫాలో అవుతూనే ఉంటుంది' అంటూ ఈ భారీ దేహం వెనక అసలు సంగతులు చెప్పాడు కుర్ర భల్లాల దేవుడు.

,  ,  ,  ,  ,  ,  ,