Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Jun-2017 13:12:44
facebook Twitter Googleplus
Photo

సినిమా అంటే మన చుట్టూ ఉన్న కథల్నే మనకు మరింతగా మనసుకు హత్తుకునేలా చెప్పే ఒక విజువల్ మీడియా. ఇప్పుడు మన దేశంలో కథలు ఎక్కువగా రియల్ స్టోరీస్ ప్రేరణతో నిర్మిస్తున్నారు. కిందటి ఏడాది ఇలానే ఒక రియల్ స్టోరీ ఆధారంగా వచ్చిన స్పోర్ట్స్ డ్రామాగా - స్త్రీ శక్తిని నలుదిక్కులా ప్రతిద్వనించేలా చేసిన సినిమా దంగల్. మహావీర్ సింగ్ ఫోగట్ అనే రెస్లింగ్ చాంపియన్ జీవితకథ ఆధారంగా తీసిన ఈ సినిమా మన దేశం బాక్స్ ఆఫీసు వద్దనే కాకుండా ప్రపంచ బాక్స్ ఆఫీసు వద్ద కూడా తన సత్తా చాటింది. అసలు మెరుపులు తగ్గితే ఒట్టు.

అమీర్ ఖాన్ నటించిన దంగల్ వరల్డ్ వైడ్ కలెక్షన్లలలో 2000 కోట్లు మార్కుకు చేరింది. వరల్డ్ మూవీ మార్కెట్ లో ఇంత కలెక్షన్లు వసూలు చేసిన మొదటి ఇండియన్ సినిమాగా దంగల్ రికార్డు నెలకొల్పింది. అంతే కాకుండా వరల్డ్ వైడ్ గా నాన్ ఇంగ్లిష్ సినిమాగా విడుదలై అత్యంత ఎక్కువ కలెక్షన్లు చేసిన 5వ సినిమాగా కూడా రికార్డు సొంతం చేసుకుంది. మొన్ననే చైనా లో కూడా విడుదలై ఇండియా సినిమాలు అన్నింటిలోకల్లా ఎక్కువ గ్రాస్ కలెక్షన్ చేసిన సినిమాగా మరో రికార్డు చేసింది

,  ,  ,  ,  ,