Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jul-2017 13:04:01
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ కంబ్యాక్ మూవీతో తన స్టైల్ ఆఫ్ మేకింగ్ ఎలాంటిదో చూపించాడు. ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టేశాడు. ఒక మాస్ చిత్రంతో 100 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టడం టాలీవుడ్ సాధ్యమే అని ప్రూవ్ చేశాడు వినాయక్. ఆ సినిమా వచ్చిన ఆరు నెలల తర్వాత ఇప్పటికి వినాయక్ కొత్త సినిమా కన్ఫాం అయినట్లు తెలుస్తోంది.

ఈసారి కూడా మెగా ఫ్యామిలీకే వర్క్ చేయనున్నాడు వినాయక్. మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ హీరోగా.. ఈ మాస్ డైరెక్టర్ కొత్త సినిమా ప్రారంభం కానుంది. నిజానికి ఫిబ్రవరిలోనే తేజు-వినాయక్ కాంబినేషన్ లో మూవీ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ బడ్జెట్ విషయంలో నిర్మాత టాగూర్ మధుతో ఒప్పందానికి రాలేకపోయాడు ఈ దర్శకుడు. తన పారితోషికం కానీ.. బడ్జెట్ కానీ తగ్గించుకోకపోవడంతో.. తేజుతో అంత బడ్జెట్ కాదనే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్టు మొదలుకాలేదు. కానీ నిర్మాత సి కళ్యాణ్ ఈ కాంబోను ఓకే చేయించగలిగాడు.

ప్రస్తుతం బాలకృష్ణతో 102వ సినిమా చేస్తున్న సి కళ్యాణ్.. వినాయక్ కు భారీ మొత్తం ఆఫర్ చేసి ఈ ప్రాజెక్టును ఓకే చేయించగలిగాడు. ఆకుల శివ రాసిన స్టోరీని ఇప్పటికే ఫైనల్ చేయగా.. దుర్గ అనే టైటిల్ ను కూడా ఖాయం చేసుకున్నారట.

,  ,  ,  ,