Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jun-2016 14:51:04
facebook Twitter Googleplus
Photo

త్రివిక్రమ్ సినిమాకు తెలుగు సినీ పరిశ్రమలో ఏ స్థాయి అభిమానులున్నారో చెప్పక్కర్లేదు. ఆయన సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అభిమానుల్లో ఉత్సాహం నింపుతూ త్రివిక్రమ్ తెరకెక్కించిన ?అ..ఆ..? సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. నితిన్, సమంత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందు నుంచే మంచి అంచనాలను క్రియేట్ చేయగా, విడుదల తర్వాత సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ వద్ద తిరుగనేదే లేకుండా దూసుకుపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు త్రివిక్రమ్‌కు అతిపెద్ద మార్కెట్ బేస్ ఉన్న యూఎస్‌లోనూ అ..ఆ.. కలెక్షన్స్ మోత మోగిస్తోంది.
ఇక సాధారణంగా సినిమాలు విడుదలయ్యే శుక్రవారం కాకుండా, గురువారమే విడుదలైన ఈ సినిమా, నాలుగు రోజుల వీకెండ్‌ను బాగా క్యాష్ చేసుకొని నాలుగు రోజుల్లో 16.04 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. ఇక వీకెండ్ పూర్తయ్యాక సోమవారం కూడా కలెక్షన్స్ ఏమాత్రం తగ్గకపోవడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సోమవారం రోజున ఏపీ, తెలంగాణాల్లో 2 కోట్ల 35 లక్షల మేర వసూళ్ళు సాధించిన ఈ సినిమా మున్ముందు లాంగ్‌రన్‌లో భారీ లాభాలనే తెచ్చిపెట్టనుంది.
ఇప్పటివరకూ 18.39 కోట్ల రూపాయల షేర్ సాధించిన ?అ..ఆ..? సినిమాకు సంబంధించి ప్రాంతాల వారీగా కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి..
ఏరియా కలెక్షన్స్ (షేర్)
నైజాం 7.70 కోట్లు
సీడెడ్ 2.70 కోట్లు
నెల్లూరు 53 లక్షలు
తూర్పు గోదావరి 1.52కోట్లు లు
పశ్చిమ గోదావరి 1.12 కోట్లు
కృష్ణా 1.38 కోట్లు
గుంటూరు 1.44 కోట్లు
వైజాగ్ 2 కోట్లు
మొత్తం 18.39 కోట్లు

,  ,  ,  ,  ,  ,