Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Apr-2016 11:22:48
facebook Twitter Googleplus
Photo

ఓ స్టార్ డైరెక్టర్ తో తను సినిమా చేయాలని ఏ హీరో అయినా అనుకుంటాడు. కానీ తనతో ఆ దర్శకుడు సినిమా తీసే ఛాన్స్ లేదని ఓ సీనియర్ హీరో అన్నాడంటే.. అందుకు కారణాలు చాలా స్ట్రాంగ్ గానే ఉండాలి. ఇప్పుడు హీరో శ్రీకాంత్ ఇదే కామెంట్ చేశాడు. గతంలో అయితే దర్శకుడు బోయపాటి శ్రీను తనతో సినిమా చేస్తాడని అనుకునే వాడినని.. కానీ ఇప్పుడా ఆశ చచ్చిపోయిందని అంటున్నాడు శ్రీకాంత్.

గతంలో శ్రీకాంత్ నటించిన రెండు సినిమాలకు బోయపాటి అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశాడు. బోయపాటి పెద్ద డైరెక్టర్ అవుతాడని అప్పుడే అనుకున్నట్లు చెప్పాడు శ్రీకాంత్. ఆ సమయంలో బోయపాటి రాసే డైలాగ్స్ తనను ఆశ్యర్యానికి గురిచేసేవని చెప్పాడు. ఫ్యూచర్ లో ఇతను డైరెక్టర్ అయ్యాక తనతో ఒక సినిమా అయినా చేస్తాడని ఆశించాడట కూడా. అయితే.. ఆ కోరిక నెరవేరలేదని అంటున్నాడీ సీనియర్ హీరో. ఈ సంగతులన్నీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరైనోడు సక్సెస్ మీట్ లో పంచుకున్నాడు శ్రీకాంత్.

ఇప్పుడు బోయపాటి తనతో సినిమా చేయకపోయినా పర్లేదని.. కనీసం తన కొడుకు రోషన్ తో అయినా సినిమా చేస్తే చాలంటున్నాడు. మరి శ్రీకాంత్ ఈ కోరికను అయినా బోయపాటి తీరుస్తాడో లేదో. ?

,  ,  ,  ,  ,  ,  ,  ,