Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jun-2016 12:35:52
facebook Twitter Googleplus
Photo

అఆ సినిమా దాదాపు నెల రోజుల కిందటే ఫస్ట్ కాపీతో రెడీ అయిపోయింది. మే 6నే రిలీజ్ డేట్ కూడా కన్ఫమ్ చేసుకున్నారు ఓ టైంలో. కానీ ఆ దిశగా సన్నాహాలు చేసుకుంటున్న టైంలో ఉన్నట్లుండి ?బ్రహ్మోత్సవం? లైన్లోకి వచ్చేసింది. ఆ సినిమాను ముందు మే 13కి అనుకోవడంతో ?అఆ?ను హోల్డ్ లో పెట్టేశారు. ?బ్రహ్మోత్సవం? వచ్చాక చూసుకుందాంలే అని ఆడియో రిలీజ్ కూడా ఆలస్యంగా పెట్టుకున్నారు. కానీ తర్వాత ?బ్రహ్మోత్సవం? డేట్ మే 20కి మారింది. దీంతో మే నెల మీద ఆశలు వదిలేసుకుంది ?అఆ? టీమ్. ?బ్రహ్మోత్సవం?కు ముందు వెనుకా వారాల్లో తమ సినిమాను రిలీజ్ చేయలేక జూన్ లోకి వచ్చేశారు. ఐతే అప్పుడు మహేష్ సినిమాను చూసి అంత భయపడ్డ ?అఆ? ఇప్పుడు.. ఆ సినిమా అడ్రస్ గల్లంతయ్యేలా చేసింది.

తొలి వారంలోనే ?బ్రహ్మోత్సవం? థియేటర్లు వెలవెలబోవడంతో వేరే సినిమాలతో వాటిని చాలా వరకు రీప్లేస్ చేసిన సంగతి తెలిసిందే. ఇక రెండో వారం పూర్తయ్యే లోపే ?అఆ? వచ్చేయడంతో ?బ్రహ్మోత్సవం? పరిస్థితి ఖేల్ ఖతం అన్నట్లు అయిపోయింది. హైదరాబాద్ లాంటి చోట్ల పూర్తిగా సింగిల్ స్క్రీన్ల నుంచి సినిమాను లేపేశారు. మల్టీప్లెక్సుల్లో ఒకటీ అరా షోలు నడుస్తున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. ఈ వారం ?అఆ? రావడం వల్ల అనే కాదు.. ఇంకేదైనా ఓ మోస్తరు సినిమా ఏది వచ్చినా పరిస్థితి ఇలాగే ఉండేది. రెండో వీకెండ్ అయ్యాక అసలు ?బ్రహ్మోత్సవం? థియేటర్లు దాదాపుగా ఖాళీ అయిపోయాయి. మహేష్ సినిమాకు రెండో వారంలోనే ఇలాంటి పరిస్థితి రావడం అరుదైన విషయం.

,  ,  ,  ,  ,  ,