Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Nov-2017 12:42:17
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడానికి ఏ నటుడైనా గొప్ప అవకాశంగానే భావిస్తాడు. పైగా త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ చేసే సినిమా అంటే ఎగ్జైట్మెంట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం ఆది పినిశెట్టి ఆ ఎగ్జైట్మెంట్ తోనే కనిపిస్తున్నాడు. పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘అజ్నాతవాసి’లో ఆది కీలక పాత్ర చేస్తున్నాడు. అతడిది పూర్తి స్థాయి విలన్ పాత్ర కాదట. కానీ నెగెటివ్ షేడ్స్ ఉంటాయట. ఈ చిత్ర తన కెరీర్లో మరో మైలురాయి అవుతుందని ఆది అంటున్నాడు. ఈ సినిమాతో తెలుగులో తన కెరీరే మారిపోతుందని కూడా చెప్పాడు.

త్రివిక్రమ్ సినిమాలో తన పాత్రకు ఒక ఐడియాలజీ ఉంటుందని.. తనకు ఏమనిపిస్తే అది చేసే పాత్ర అదని ఆది తెలిపాడు. ప్రేక్షకులపై ఈ పాత్ర బలమైన ముద్ర వేస్తుందని.. త్రివిక్రమ్ అంత బాగా ఈ పాత్రను రాశాడని ఆది చెప్పాడు. పవన్ కళ్యాణ్.. తన కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని.. సినిమా విడుదలయ్యాక అందరూ వీటి గురించే మాట్లాడుకుంటారని ఆది చెప్పాడు. ఇక పవన్ తో కలిసి నటించిన అనుభూతి చాలా ప్రత్యేకమని.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే పవన్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఆది తెలిపాడు.

,  ,  ,  ,