స్టైలిష్ స్టార్ ఇద్దరమ్మాయిలతో మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగానే దగ్గరైంది కేథరిన్ త్రెసా. అంతకు ముందే చమ్మకు చల్లో చేసినా తెలుగు ప్రజలు గుర్తు పెట్టుకుంది మాత్రం ఈ మూవీతోనే. అయితే.. దీనికి ముందే సౌత్ లో చక్కర్లు కొట్టింది ఈ మళయాళీ భామ. కన్నడ - మలయాళ ఇండస్ట్రీల్లో వెలిగేందుక ట్రై చేసింది. తెలుగులో కూడా ఆశించిన గుర్తింపు రాకపోవడంతో.. తన మకాం చెన్నైకి మార్చేసింది.
రెండేళ్ల క్రితం మద్రాస్ పేరుతో వచ్చిన కోలీవుడ్ మూవీ అమ్మడి కెరీర్ ని టాప్ గేర్ కి తీసుకెళ్లిపోయింది. ఆ తర్వాత కోలీవుడ్ వరుస ఆఫర్స్ తో దూసుకుపోయింది. లేటెస్ట్ గా కథకళి చిత్రం కూడా హిట్ కావడంతో.. ఇప్పుడు తమిళ్ లో కేథరిన్ పీక్ స్టేజ్ లోకి వెళ్లిపోయింది. ఇదే టైంలో సరైనోడు మూవీతో బన్నీ మరోసారి ఛాన్స్ ఇచ్చాడు. అయితే.. ఎంతగా పేరు తెచ్చుకున్నా సరే.. తనకు గుర్తింపు లభించినది పేరు తెచ్చినది మాత్రం మద్రాస్ తోనే అంటోంది.
'నేను మలయాళీ అమ్మాయినే అయినా.. పుట్టి పెరిగింది మాత్రం దుబాయ్ లోనే. అమ్మానాన్నా అక్కడే ఉంటారు. కాలేజ్ రోజుల్లో కన్నడ - మలయాళ సినిమాలు చేశాను. మద్రాస్ తర్వాత వరుసగా అనేక ఆఫర్స్ వస్తున్నాయి. తమిళ ప్రేక్షకులు కూడా నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. అలాగే నాకు నెంబర్ వన్ టూ లాంటి నెంబర్స్ మీద నమ్మకం లేదు'అంటోంది కేథరిన్ త్రెసా