Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jun-2017 12:50:04
facebook Twitter Googleplus
Photo

గోపిచంద్ హీరోగా బి.గోపాల్ డైరక్షన్లో రూపొందిన సినిమా ఆరడుగుల బుల్లెట్. ఈ సినిమాను ఎప్పటినుండో రిలీజ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఫైనల్ గా ఈరోజున రిలీజ్ చేయడానికి డిసైడ్ చేశారు. అయితే ఈ సినిమా ఈరోజు రిలీజవుతుంది అంటూ ఎక్కడెక్కడ ఎన్నేసి యాడ్లు వేసినా కూడా.. ఇప్పుడు ఈ బుల్లెట్ ఒక్క అడుగు కూడా వేయలేదు.

కొన్ని అనివార్య కారణాల వలన ఇప్పుడు ఆరడుగుల బుల్లెట్ సినిమా మార్నింగ్ షో పడలేదని తెలుస్తోంది. అయితే మ్యాటనీ నుండి షోలు పడతాయి అనుకుంటే.. ఆ షోస్ కూడా కాస్త కష్టమే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని ఫైనన్షియల్ ఇబ్బందుల కారణంగా.. అవి క్లియర్ అయ్యేవరకు ఈ సినిమాను రిలీజ్ చేయడం కష్టం అన్నట్లుగా చెబుతున్నారు. అయితే రేపైనా ఈ సినిమా రిలీజవుతుందా లేదా అనే విషయం మాత్రం ప్రశ్నార్ధకం అని ఇంకొందరు చెబుతున్నారు. ఇకపోతే సోషల్ మీడియాలో కొందరు మాత్రం సినిమా చూసేశాం అంటూ కామెంట్లు పెట్టడమే ఇక్కడ పెద్ద ట్విస్టు.

ఏదేమైనా కూడా గోపిచంద్ ఇప్పుడు హిట్టు కొట్టాల్సిన తరుణం. ఈ పాత సినిమా.. అదీ కూడా వాడేసిన నాన్నసెంటిమెంటుతో రూపొందిన సినిమా.. ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది చెప్పలేం.

,  ,  ,  ,  ,