Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Sep-2016 12:09:23
facebook Twitter Googleplus
Photo

ఈ రోజుల్లో ఓ సినిమా తీయడం కంటే.. దాన్ని సరిగా రిలీజ్ చేయడం అన్నది పెద్ద సమస్యగా మారిపోయింది. ఇక్కడ మంచి ఛానెల్ దొరకడం అన్నిటికంటే కీలకం. ?పెళ్లిచూపులు? సినిమా అంత పెద్ద విజయం సాధించిందంటే అందుకు ఒకరకంగా సురేష్ బాబే కారణం. ఆయన ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయ్యాకే క్రేజ్ వచ్చింది. పెద్ద సంఖ్యలో థియేటర్లు కూడా దొరికాయి. చిన్న సినిమాలన్నింటికీ ఇలాంటి అండ దొరకడం కష్టం. అందుకే ఈ విషయంలో ప్రకాష్ రాజ్ జాగ్రత్త పడ్డాడు. తన దర్శకత్వంలో తెరకెక్కిన ?మనవూరి రామాయణం? చిత్రానికి ఆయనకు పెద్ద అండే దొరికింది.

నైజాం ఏరియాలో దిల్ రాజుకు దీటుగా బడా డిస్ట్రిబ్యూటర్ గా ఎదిగిన అభిషేక్ ?మనవూరి రామాయణం?ను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రిలీజ్ చేస్తుండటం విశేషం. రెండు రాష్ట్రాల్లోనూ ఎగ్జిబిటర్లతో అభిషేక్ కు మంచి సంబంధాలున్నాయి. ఆయన సినిమాలకు థియేటర్లు బాగానే దొరుకుతాయి. ?మనవూరి రామాయణం? హక్కుల్ని హోల్ సేల్ గా కొనేసి రిలీజ్ చేస్తున్నాడు అభిషేక్. దసరాకు చాలా సినిమాల పోటీ ఉన్న నేపథ్యంలో మామలుగా అయితే ప్రకాష్ రాజ్ చిత్రానికి థియేటర్లు దొరకడం కష్టమయ్యేది. కానీ ఆయన సరైన ఛానెల్ చూసుకున్నాడు. మరోవైపు ప్రమోషన్ కూడా బాగా చేస్తుండటంతో ?మనవూరి రామాయణం?పై అంచనాలు పెరుగుతున్నాయి. అక్టోబరు 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.

,  ,  ,  ,  ,