Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Oct-2017 10:31:41
facebook Twitter Googleplus
Photo

ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు ఫిదా చేసేయబోతోంది. ఆల్రెడీ ఫిదా మూవీతో సాయి పల్లవి టాలీవుడ్ జనాలను ఫిదా చేసేసింది. ఇప్పుడు రకుల్ ప్రీత్ మళ్లీ ఎలా అంటే.. ఓ టెలివిజన్ ఎపిసోడ్ తో ఫిదా చేస్తోంది రకుల్. ఫిదా టైటిల్ పై ఇప్పుడు ఓ తెలుగు ఛానల్ టీవీ షో నిర్వహిస్తుండగా.. దీని తొలి ఎపిసోడ్ ను రకుల్ పైనే తెరకెక్కించారు.

ఫిదా.. మీ ఫేవరెట్ స్టార్ తో.. అంటూ జెమినీ టీవీ ప్రతీ ఆదివారం సాయంత్రం టెలికాస్ట్ చేయనున్న ఈ ప్రోగ్రామ్ స్పెషాలిటీ రకుల్ ప్రీత్ తో మొదలుపెట్టడం మాత్రమే కాదు. అఆ మూవీ.. ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోతో తెలుగు జనాలను తెగ మెప్పించేసిన హరితేజ యాంకరింగ్ చేసేయడం. ఈ భామకు బుల్లితెర నుంచి విపరీతమైన డిమాండ్ నెలకొనగా.. ఇప్పుడు తన తొలి షోగా ఫిదా అంటూ.. స్టార్లతో ఓ రోజు మొత్తం గడిపితే అనే కాన్సెప్ట్ తో ఈ కార్యక్రమం రూపొందింది.

తాజాగా మంచు లక్ష్మి ఈ కార్యక్రమం టీజర్ ను రిలీజ్ చేస్తూ.. రకుల్ ప్రీత్ సింగ్ కు బెస్ట్ విషెస్ చెప్పింది. రకుల్ ని హరితేజ బాగానే హ్యాండిల్ చేసినట్లుగా కనిపిస్తోంది. రకుల్ ప్రీత్ కూడా ఓపెన్ గా బాగానే సమాధానాలను ఇచ్చింది.

,  ,  ,  ,  ,  ,