Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Nov-2017 14:16:23
facebook Twitter Googleplus
Photo

ప్రభాస్ రేంజ్ ఏ స్థాయిలో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ప్రభాస్ నెక్స్ట్ సినిమా సాహో ఎప్పుడు వస్తుందా అని దేశమంతటా ప్రభాస్ బాహుబలి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. రెబల్ స్టార్ కూడా ఏ మాత్రం తొందరపడకుండా ఈ సినిమాతో తన అసలు స్టామినాని చూపించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది.

అయితే ఈ షెడ్యూల్ తర్వాత సినిమాలో కీలకమైన యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరించాలని ప్రభాస్ హాలీవుడ్ కి వెళ్లనున్నాడట. అక్కడ చిత్ర యూనిట్ కొన్ని భారీ యాక్షన్ సీన్స్ చేసింగ్ సీన్స్ ను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తోందని సమాచారం. ప్రముఖ హాలీవుడ్ స్టంట్స్ కొరియోగ్రాఫర్ కెన్నీ బెట్స్ నేతృత్వంలో ఆ షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. అయితే ఈ స్టంట్స్ మాస్టర్ ముందుగా ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ ని గమనించి ఏం చేయగలడు అనే విషయంపై ఒక నిర్ణయానికి వచ్చి ప్రభాస్ కి సెట్ అయ్యే విధంగా యాక్షన్ సీన్స్ ని డిజైన్ చేస్తున్నాడట. మూడువారాల పాటు ప్రభాస్ హాలీవుడ్ లోనే ఉంటాడని తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం దుబాయ్ లో దర్శకుడు సుజీత్ షూటింగ్ ని త్వర త్వరగా పూర్తి చేస్తున్నాడు. ఆ సీన్స్ అయిపోగానే వెంటనే నెక్స్ట్ షెడ్యూల్ ని స్టార్ట్ చేస్తారట. శ్రద్దా కపూర్ నటిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటులు విలన్స్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

,  ,  ,  ,  ,  ,