Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Feb-2017 10:24:51
facebook Twitter Googleplus
Photo

కొన్ని రోజులుగా ఓ పోస్టర్ బాగా ఆడియన్స్ లో బాగా క్యూరియాసిటి క్రియేట్ చేసేసింది. పోస్టర్ లో హీరోని వెనక నుంచి చూపించి.. జనాలను తెగ ఊరించేశారు. పైగా టైటిల్ కూడా వీడెవడు అని పెట్టడం.. పేరు కూడా కాసింత మాసీగా ఉండడంతో.. వీడెవడు అనే క్వశ్చన్ బాగానే రెయిజ్ అయింది. చివరకు అఖిల్ లాంటి యంగ్ హీరో ఈ పోస్టర్ ని పోస్ట్ చేయడం.. టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయింది. ఓ బాలీవుడ్ హీరో.. స్పోర్ట్స్ స్టార్ అంటూ అఖిల్ ట్వీట్ పెట్టడం ఈ పోస్టర్ వైరల్ అయింది.

ఆ తర్వాత వీడెవడు పోస్టర్ లో ఉన్న హీరో ఎవరో గుర్తు పట్టాలంటూ వీడెవడు కాంటెస్ట్ కూడా రన్ చేశారు. గెలిచినవాళ్లకు ఫారిన్ ట్రిప్ కూడా ఆఫర్ చేశారు. ఇదంతా చూసి.. ఎవరో కొత్త హీరో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నాడని అంతా అనుకున్నారు కానీ.. వేలంటైన్స్ డే సందర్భంగా.. వీడెవడు అనే విషయం తేలిపోయింది. ఎవరో కాదు.. టాలీవుడ్ జనాలకు బాగానే పరిచయం ఉన్న హీరో సచిన్ జోషీ. మూడేళ్ల క్రితం నీ జతగా నేనుండాలి అంటూ ఆషికి2 రీమేక్ తో వచ్చి ఎదురు దెబ్బ తిన్న సచిన్ జోషి.. ఇప్పుడు వీడెవడు అంటూ తెలుగులోను.. యార్ ఇవాన్ అంటూ తమిళ్ లోను ఒకేసారి సినిమాని చేసేస్తున్నాడు.

ప్రమోషన్ క్లిక్ అయింది.. సినిమా సంగతి ఏంటో రిలీజ్ అయ్యాక జనాలు చెప్పాలి. ఇంతకీ ఈ సచిన్ జోషి.. అఖిల్ కి ఎలా క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడబ్బా అనుకుంటున్నారు టాలీవుడ్ జనాలు. ఇద్దరూ కలసి సిసిఎల్ క్రికెట్ లో టాలీవుడ్ టీమ్ లో ఆడారుగా.. అందుకే మాంచి స్నేహితులు అయిపోయారు. మరోవైపు ఘాజీతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్న దగ్గుబాటి రానా కూడా.. సచిన్ జోషీకి విషెస్ చెబుతూ ట్వీట్ పెట్టాడు.

,  ,  ,  ,  ,  ,