Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Jul-2016 11:45:13
facebook Twitter Googleplus
Photo

తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో స్టార్ హీరోల్లో ఒకరైన చియాన్ విక్రమ్, ఈ సాయంత్రం తన కూతురు అక్షిత నిశ్చితార్థ వేడుకను వైభవంగా జరిపారు. తమిళనాడులోని ప్రధాన రాజకీయ పార్టీల్లో ఒకటైన డీఎంకే అధినేత కరుణానిధి ముని మనువడు మను రంజిత్‌తో అక్షిత నిశ్చితార్థం చెన్నైలోని ఓ స్టార్ హోటల్లో తమిళ సాంప్రదాయాల ప్రకారంగా జరిగింది. ఈ వేడుకకు విక్రమ్ సన్నిహితులతో పాటు సినీ పరిశ్రమ నుంచి కూడా పలువురు తారలు విచ్చేశారు.
ఇక కొద్దికాలంగా ప్రేమలో ఉన్న అక్షిత, మను నేడు నిశ్చితార్థంతో ఒక్కటయ్యారు. వచ్చే ఏడాది అంగరంగ వైభవంగా వివాహ వేడుకను నిర్వహించనున్నారు. ఇక ఈ సాయంత్రం పూర్తి ప్రైవేటు కార్యక్రమంగా జరిగిన ఈ వేడుకకు పాపులర్ డైరెక్టర్ శంకర్ సహా, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. ఇదిలా ఉంటే విక్రమ్ సినిమాల విషయానికి వస్తే, ఆయన నటించిన ఇరు ముగన్ (తెలుగులో ?ఇంకొక్కడు?) సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉంది

,  ,  ,  ,  ,  ,