Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Nov-2016 13:06:24
facebook Twitter Googleplus
Photo

తెలుగులో ఈ రోజుల్లో.. బస్ స్టాప్ లాంటి చిన్న సినిమాల్లో చేసిన రక్షిత గుర్తుందా..? మన దగ్గర అంతగా పేరు తెచ్చుకోలేకపోయిన ఈ అమ్మాయి ఆనంది పేరుతో తమిళ ప్రేక్షకులకు పరిచయమై బాగానే పాపులర్ అయింది. అంజలి.. స్వాతి.. శ్రీదివ్యల తరహాలో తమిళుల్ని బాగా ఆకట్టుకుంది ఈ తెలుగమ్మాయి. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగైదు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. ఐతే ఈ మధ్య మరో క్రేజీ ప్రాజెక్టు నుంచి ఆమె బయటికి వచ్చేయడం చర్చనీయాంశమవుతోంది.

వరుస హిట్లతో జోరుమీదున్న అధర్వ హీరోగా నటిస్తున్న సినిమా అది. ?జెమిని గణేశనుం సురులి రాజనుం? అనే టైటిల్ తో ఓడమ్ ఇలవరసు అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకు కొన్ని నెలల కిందటే అంగీకారం తెలుపుతూ అడ్వాన్స్ కూడా తీసుకుంది ఆనంది. ఐతే సినిమా మొదలైన కొన్ని రోజులకు తాను ఈ చిత్రంలో నటించలేనని చెప్పి.. అడ్వాన్స్ తిరిగిచ్చేసి బయటికి వచ్చేసింది. ఆమె స్థానంలో అదితి అనే కొత్తమ్మాయిని తీసుకున్నారు.

తనకు స్క్రిప్టు దశలో చెప్పినట్లుగా సినిమా తీయకపోవడమే తాను బయటికి వచ్చేయడానికి కారణమని ఆనంది తెలిపింది. తన పాత్రకు దర్శకుడు ప్రాధాన్యం తగ్గించేసినట్లు వెల్లడించింది. ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా.. ఐశ్వర్య రాజేష్ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. వాళ్లిద్దరి మధ్య తన పాత్ర అంతగా పండేలా లేదని.. ఇలాంటి ప్రాధాన్యం లేని పాత్ర చేయడం వల్ల కెరీర్ దెబ్బ తింటుందని భావించిన ఆనంది ఆ సినిమా నుంచి బయటికి వచ్చేసినట్లు భావిస్తున్నారు. కెరీర్ ఆరంభంలో ఇలా ధైర్యంగా నిర్ణయం తీసుకుని.. ఒక క్రేజీ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేయడం గ్రేట్ అంటూ ఆనందిని అభినందిస్తున్నారు తమిళ జనాలు.

,  ,  ,  ,