Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Jan-2017 15:31:21
facebook Twitter Googleplus
Photo

అక్కినేని నాగార్జున.. రామ్ గోపాల్ వర్మల మధ్య బంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాగార్జున వల్ల వర్మకు దర్శకుడిగా జన్మ లభించింది. ఆ తర్వాత అతను ఎక్కడికో వెళ్లాడు. అలాగే వర్మ వల్ల నాగార్జున కెరీర్ అద్భుతమైన మలుపు తిరిగింది. పెద్ద స్టార్ అయ్యాడు. వీళ్లిద్దరిలో ఎవరి వల్ల ఎవరికి ఎక్కువ మేలు జరిగిందో.. ఎవరు ఎవరికి రుణపడి ఉంటారో చెప్పడం కష్టం. ఐతే ఇద్దరూ కూడా అవతలి వ్యక్తికే తాము రుణపడి ఉన్నామంటారు. ఈ మధ్య ?వంగవీటి? ఆడియో వేడుకలో వర్మ.. నాగ్ మీద ఎంతగా తన ప్రేమను చాటుకున్నాడో తెలిసిందే. మామూలుగా వర్మ ఎవరినైనా పొగిడితే.. అందులో వేరే అర్థాలున్నాయేమో అనిపిస్తుంది. కానీ నాగ్ విషయంలో మాత్రం అలా అనిపించదు.

తాజాగా నాగార్జున సైతం వర్మ మీద తన ప్రేమాభిమానాల్ని చాటుకున్నాడు. ?ఓం నమో వెంకటేశాయ? ప్రమోషన్లలో భాగంగా ఒక టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమంలో వర్మ ప్రస్తావన రాగా.. అతడిపై తన ప్రేమ ఎప్పటికీ చావదంటూ ఆసక్తికర కామెంట్ చేశాడు నాగ్. తన కెరీర్ మలుపు తిరగడానికి వర్మే కారణమని.. తనకు ?శివ? లాంటి సినిమా అందించిన వర్మకు ఎప్పటికీ రుణపడి ఉంటానని నాగ్ అన్నాడు. అతడిపై తన ప్రేమ అనంతం అన్నాడు. వర్మ ట్విట్టర్లో తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపైనా నాగ్ స్పందించడం విశేషం. వర్మ తనకేదనిపిస్తే అది మాట్లాడతాడని.. వాటితో ఇబ్బంది ఉన్నవాళ్లు వర్మ ట్వీట్లను చదవడం మానేయొచ్చని నాగ్ తేల్చి చెప్పాడు. ఈ మధ్య వర్మ చేసిన వివాదాస్పద ట్వీట్లపై సెలబ్రెటీల నుంచి కూడా నెగెటివ్ కామెంట్లు పడుతుండగా.. నాగ్ మాత్రం వర్మకు మద్దతుగా మాట్లాడుతూ.. సూటిగా విషయాన్ని తేల్చేయడం విశేషమే.

,  ,  ,  ,