Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Feb-2017 12:10:30
facebook Twitter Googleplus
Photo

గోపీచంద్ సరసన ఒంటరిలో.. నితిన్ తో కలిసి హీరో సినిమాలో నటించిన భావన గుర్తుంది కదా. మలయాళంలో.. తమిళంలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఈ భామకు చేదు అనుభవం ఎదురైంది. ఆమెను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి.. కార్లో లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఎర్నాకులంలో భావన కారును కొందరు వ్యక్తులు ఆపి.. బలవంతంగా అందులోకి ఎక్కారు. అక్కడి నుంచి 25 కిలోమీటర్ల దూరంలోని పాలరివట్టంకు కారు వచ్చే వరకు ఆమెను లైంగికంగా వేధించారు. తర్వాత ఆమెను వదిలేసి మరో కార్లో పారిపోయారు.

భావన అక్కడి నుంచి కాక్కనాడ్ లోని ఒక దర్శకుడి ఇంటికి వెళ్లింది. ఆ దర్శకుడే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. భావన స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఒక వ్యక్తిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. భావన కారు డ్రైవర్ నిందితులకు సహకరించినట్లు తెలిసింది. భావన మాజీ డ్రైవర్ కు ఇందులో పాత్ర ఉన్నట్లు వెల్లడైంది. సునీల్ కుమార్ అనే వ్యక్తి ఇందులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్నారు. కార్లో భావనను లైంగికంగా వేధిస్తూ ఆమె ఫొటోలు.. వీడియో కూడా తీసినట్లు తెలుస్తోంది. భావన లాంటి సెలబ్రెటీకే ఇలాంటి పరిస్థితి ఎదురవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

,  ,  ,  ,